Ram gopal varma | టాలీవుడ్ నటి సమంతపై మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) చేసిన వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. నాగచైతన్య, సమంత విడాకులపై కొండా సురేఖ మాట్లాడిన తీరు పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే సినీ ఇండస్ట్రీ నుంచి స్టార్ సెలబ్రిటీలు సమంతకు మద్దతుగా నిలిచారు.
మరోవైపు డైరెక్టర్ వర్మ రాంగోపాల్ వర్మ మాత్రం కొండాసురేఖ సమంతకు క్షమాపణ చెప్పటమేంటి..? అని ప్రశ్నిస్తున్నాడు. దీనికి సంబంధించిన ఆడియో ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. వర్మ మాట్లాడుతూ.. కొండా సురేఖ గారు సమంతను అవమానించలేదు.. పొగిడారు. అక్కడ నాగార్జునని, నాగ చైతన్యని.. ఒక మామగా, ఒక భర్తగా, ఒక కోడలిని , ఒక భార్యను, వాళ్లకి సంబంధించిన ఒక ఆస్తిని కాపాడుకోవడానికి ఫోర్స్‌తో పంపించడానికి ట్రై చేస్తే, తను (సమంత) విడాకులు ఇచ్చి వెళ్ళిపోయింది.
అక్కడ సమంతకు జరిగిన అవమానమేంటి.. ? అవమానించిందెవరిని.. అక్కడ అత్యంత జుగుప్సాకరంగా అవమానించింది నాగార్జునని, నాగ చైతన్యని. అసలు దాని గురించి ఎవరు మాట్లాడటం లేదు. ఇలాంటిది చెప్పడం, అక్కినేని లాంటి కుటుంబానికున్న హుందాతనం పక్కన పెడితే.. ఏ ఇంట్లోనైనా ఒక మామను , భర్తను ఇలా ఆరోపించడం నా జీవితంలో నేనైతే చూడలేదు. నాగార్జున, నాగచైతన్యకు రిక్వెస్ట్ చేస్తున్నా.. దీన్ని ఇలా వదిలేయకుండా చాలా సీరియస్‌గా తీసుకొని, మళ్లీ ఇలాంటివి జరుగకుండా ఇండస్ట్రీ, ప్రజలందరి కోసం మరిచిపోలేని గుణపాఠం చెప్పాలి. ఇది తప్పిస్తే మన దగ్గర వేరే మార్గం లేదు. మళ్లీ జరగకుండా చూడాలని కోరాడు ఆర్జీవీ.
Chiranjeevi | సినిమా వాళ్లను టార్గెట్ చేయడం సిగ్గుచేటు.. మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌పై చిరంజీవి
Samantha | మీ రాజకీయాల్లోకి నన్ను లాగొద్దు : కొండా సురేఖ కామెంట్స్ పై సమంత
Chinmayi Sripada | సమంత అందరికంటే ఉన్నతమైన వ్యక్తి : సింగర్ చిన్మయి