మహబూబాబాద్ : మూడు ముళ్ల బంధం ఒక్కటైన ఆ యువతి కోటి ఆశలతో అత్తగారింట అడుగు పెట్టింది. కలకాలం తోడుంటానని మనవాడిన భర్తే ఆమె పాలిట యముడయ్యాడు. అగ్ని సాక్షిగా చేసిన బాసలు మరిచి తల్లిదండ్రులతో కలిసి భార్యను కిరాతకంగా హతమార్చారు. ఇంట్లోనే పూడ్చి పెట్టారు. ఈ విషాదకర సంఘటన మహబూబాద్ (Mahabubabad) లోని సిగ్నల్ కాలనీలో చోటు చేసుకుంది.
హత్య చేసిన అనంతరం ఇంటికి తాళం వేసి భర్తతో పాటు అత్త, మామ, ఆడపడుచు పరారయ్యారు. స్థానికుల ఫిర్యాదుతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. పాతిపెట్టిన చోట తవ్వగా వివాహిత మృతదేహం బయటపడింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..