Saif Ali Khan | బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan)కు సర్జరీ (surgery) పూర్తైంది. ఈ విషయాన్ని నటుడి టీమ్ తాజాగా ప్రకటించింది. సైఫ్ ప్రమాదం నుంచి బయటపడినట్లు వెల్లడించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
‘సైఫ్ అలీఖాన్‌కు శస్త్రచికిత్స పూర్తైంది. ప్రమాదం నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారు. కుటుంబ సభ్యులంతా క్షేమంగా ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు’ అని ఓ ప్రకటనలో వెల్లడించింది. అదేవిధంగా లీలావతి ఆసుపత్రిలోని డాక్టర్ నీరజ్ ఉత్తమని, డాక్టర్ నితిన్ డాంగే, డాక్టర్ లీనా జైన్, ఇతర బృందానికి కృతజ్ఞతలు తెలియజేసింది. మరోవైపు సైఫ్ అలీఖాన్‌కు చికిత్స అందిస్తున్న వైద్యుల బృందం మరికాసేపట్లో మీడియాకు వివరాలు తెలియజేయనున్నట్లు తెలిసింది.
సైఫ్ అలీఖాన్ మీద దాడి జరిగిన విషయం తెలిసిందే. అతడిపై గుర్తుతెలియని వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. గురువారం తెల్లవారుజామున ముంబైలోని ఆయన నివాసంలోకి చొరబడిన దుండగుడు కత్తితో సైఫ్‌పై దాడి చేశాడు. దీంతో ఆయన ఒంటిపై ఆరుచోట్ల గాయాలయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన లీలావతి దవాఖానకు తరలించారు. సైఫ్ అలీఖాన్‌కు రెండు చోట్ల లోతుగా గాయలయ్యాయి. వెన్నెముక పక్కన కూడా కత్తి పోట్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. తెల్లవారుజామున 2 గంటల సమయంలో దుండగుడు దొంగతనానికి యత్నించాడని, ఈ క్రమంలోనే సైఫ్‌పై దాడి జరిగినట్లు వెల్లడించారు. 3.30 గంటలకు ఆయనను దవాఖానకు తరలించారని చెప్పారు.
Also Read..
Saif Ali Khan | సైఫ్ అలీఖాన్‌పై దాడి ఇంట్లో వారి పనేనా..? వెలుగులోకి కీలక విషయాలు..!
Sara Ali Khan | తండ్రిని చూడటానికి ఆసుపత్రికి చేరుకున్న సైఫ్ పిల్లలు సారా, ఇబ్రహీం.. వీడియో
Saif Ali Khan | బాంద్రాను టార్గెట్ చేస్తున్న దుండగులు.. మొన్న సల్మాన్.. నేడు సైఫ్.!
Chiranjeevi | సైఫ్ అలీఖాన్‌పై దాడి.. మెగాస్టార్ చిరంజీవి ఏమన్నారంటే?
Saif Ali Khan | ఫ్యామిలీ అంతా సేఫ్‌గా ఉన్నారు.. దాడి ఘటనపై కరీనా టీమ్ స్పందన
Jr NTR | సైఫ్ సర్‌పై దాడి వార్త విని షాక్ అయ్యాను : ఎన్టీఆర్