Saif Ali Khan | బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై (Saif Ali Khan) గుర్తుతెలియని వ్యక్తి దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడిలో నటుడి ఒంటిపై ఆరుచోట్ల గాయాలయ్యాయి. ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో సైఫ్‌కు చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో దాడి ఘటనపై సైఫ్ భార్య, బాలీవుడ్ స్టార్ నటి కరీనా కపూర్ (Kareena Kapoor) టీమ్ స్పందించింది.
‘నిన్న రాత్రి సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ ఖాన్ నివాసంలో చోరీకి యత్నం జరిగింది. ఓ దుండగుడు సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో సైఫ్ చేతికి గాయం అయ్యింది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కుటుంబంలోని మిగిలినవారు అంతా సేఫ్‌గానే ఉన్నారు’ అని పేర్కొంది. ఈ మేరకు స్టేట్మెంట్ విడుదల చేసింది.
సైఫ్ అలీఖాన్‌పై (Saif Ali Khan) గుర్తుతెలియని వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. గురువారం తెల్లవారుజామున ముంబైలోని ఆయన నివాసంలోకి చొరబడిన దుండగుడు కత్తితో సైఫ్‌పై దాడి చేశాడు. దీంతో ఆయన ఒంటిపై ఆరుచోట్ల గాయాలయ్యాయి. సైఫ్ అలీఖాన్‌కు రెండు చోట్ల లోతుగా గాయలయ్యాయి. వెన్నెముక పక్కన కూడా కత్తి పోట్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. తెల్లవారుజామున 2 గంటల సమయంలో దుండగుడు దొంగతనానికి యత్నించాడని, ఈ క్రమంలోనే సైఫ్‌పై దాడి జరిగినట్లు వెల్లడించారు. 3.30 గంటలకు ఆయనను దవాఖానకు తరలించారని చెప్పారు. ప్రస్తుతం వైద్యులు ఆయనకు సర్జరీ చేస్తున్నారు. శస్త్ర చికిత్స తర్వాతే సైఫ్ ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత రానుంది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన ముంబై క్రైమ్‌బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పరారైన దొంగ కోసం గాలిస్తున్నారు.
Also Read..
Jr NTR | సైఫ్ సర్‌పై దాడి వార్త విని షాక్ అయ్యాను : ఎన్టీఆర్
Saif Ali Khan: సైఫ్ అలీఖాన్‌ను ఎక్కడెక్కడ పొడిచాడు.. డాక్టర్లు ఏం చెప్పారంటే !
Saif Ali Khan | బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దుండగుడి దాడి.. దవాఖానలో చికిత్స