Jr NTR | సైఫ్ సర్‌పై దాడి వార్త విని షాక్ అయ్యాను : ఎన్టీఆర్
Jr NTR | బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై (Saif Ali Khan) గుర్తుతెలియని వ్యక్తి దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడి ఘటనపై టాలీవుడ్ స్టార్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) స్పందించారు.
Jr NTR | బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై (Saif Ali Khan) గుర్తుతెలియని వ్యక్తి దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడిలో నటుడి ఒంటిపై ఆరుచోట్ల గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో దాడి ఘటనపై టాలీవుడ్ స్టార్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) స్పందించారు. విషయం తెలుసుకుని షాక్ అయినట్లు చెప్పారు. ‘సైఫ్ సర్‌పై దాడి గురించి విని షాక్‌కు గురయ్యా. ఇది నిజంగా బాధాకర విషయం. ఆయన త్వరగా కోలుకోవాలని, పూర్తి ఆరోగ్యంతో తిరిగిరావాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను’ అని ఎన్టీఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ పెట్టారు. కాగా, గతేడాది విడుదలైన దేవర పార్ట్-1 (Devara) చిత్రంలో ఎన్టీఆర్, సైఫ్ కలిసి నటించిన విషయం తెలిసిందే.
Shocked and saddened to hear about the attack on Saif sir.
Wishing and praying for his speedy recovery and good health.
— Jr NTR (@tarak9999) January 16, 2025
సైఫ్ అలీఖాన్‌పై (Saif Ali Khan) గుర్తుతెలియని వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. గురువారం తెల్లవారుజామున ముంబైలోని ఆయన నివాసంలోకి చొరబడిన దుండగుడు కత్తితో సైఫ్‌పై దాడి చేశాడు. దీంతో ఆయన ఒంటిపై ఆరుచోట్ల గాయాలయ్యాయి. సైఫ్ అలీఖాన్‌కు రెండు చోట్ల లోతుగా గాయలయ్యాయి. వెన్నెముక పక్కన కూడా కత్తి పోట్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. తెల్లవారుజామున 2 గంటల సమయంలో దుండగుడు దొంగతనానికి యత్నించాడని, ఈ క్రమంలోనే సైఫ్‌పై దాడి జరిగినట్లు వెల్లడించారు. 3.30 గంటలకు ఆయనను దవాఖానకు తరలించారని చెప్పారు. ప్రస్తుతం వైద్యులు ఆయనకు సర్జరీ చేస్తున్నారు. శస్త్ర చికిత్స తర్వాతే సైఫ్ ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత రానుంది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన ముంబై క్రైమ్‌బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పరారైన దొంగ కోసం గాలిస్తున్నారు.
Also Read..
Saif Ali Khan | బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దుండగుడి దాడి.. దవాఖానలో చికిత్స
Saif Ali Khan: సైఫ్ అలీఖాన్‌ను ఎక్కడెక్కడ పొడిచాడు.. డాక్టర్లు ఏం చెప్పారంటే !
KTR | ఈడీ విచారణకు బయలుదేరిన కేటీఆర్.. భారీగా పోలీస్ బందోబస్తు : వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

