హైదరాబాద్, జనవరి 15 (నమస్తే తెలంగాణ) : మరికొద్దిసేపట్లో ఫార్ములా- ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) అధికారుల విచారణకు హాజరుకానున్నారు. ఈనెల 7న మరోసారి నోటీసులు ఇచ్చిన ఈడీ అధికారులు..16న తమ విచారణకు హాజరుకావాలని కోరారు. దీంతో గురువారం ఉదయం 10 గంటలకు గచ్చిబౌలిలోని తన నివాసం నుంచి బయలుదేరి, 10.30 గంటలకు ఎల్బీ స్టేడియం ఎదురుగా ఉన్న ఈడీ కార్యాలయానికి కేటీఆర్ చేరుకుంటారు. ఈ నేపథ్యంలో ఈడీ కార్యాలయం ఎదుట భారీగా పోలీసు బలగాలను మోహరించారు.
కాసేపట్లో ఫార్ములా- ఈ కేసులో ఈడీ విచారణకు హాజరు కానున్న కేటీఆర్
ఈడీ కార్యాలయం ఎదుట భారీగా మోహరించిన పోలీసులు pic.twitter.com/CSneJfwG7F
— Telugu Scribe (@TeluguScribe) January 16, 2025