హైదరాబాద్ : రాష్ట్రంలో బుధవారం నుంచి ఇంటర్ పరీక్షలు ( Mal Practice) ప్రారంభమయ్యాయి. పరీక్షల రెండో రోజు గురువారం ఇంటర్ ద్వితీయ సంవత్సరం సెకండ్ లాంగ్వెజ్ ( Second Language ) పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని ఇంటర్మీడియట్ బోర్టు సెక్రటరీ తెలిపారు.
మొత్తం 4,63,354 మంది విద్యార్థులకు గాను 4,52,980 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని వివరించారు. 10,374 మంది గైర్హాజరయ్యారని వెల్లడించారు. వరంగల్లో 3, రంగారెడ్డి జిల్లాలో ఒకరు మాల్ ప్రాక్టీసు ( Mal Practice ) కు పాల్పడుతూ అధికారులకు పట్టుబడ్డారని పేర్కొన్నారు. వనపర్తి, వికారాబాద్, భద్రాద్రి, ఆదిలాబాద్, మంచిర్యాల, వరంగల్, సిద్దిపేట, మెదక్, కరీంనగర్, ములుగు, పెద్దపల్లి పరీక్షా కేంద్రాల పర్యవేక్షణకు పరిశీలకులను నియమించినట్లు తెలిపారు.