Sara Ali Khan – Ibrahim Ali Khan | బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ మీద దాడి జరిగిన విషయం తెలిసిందే. అతడిపై గుర్తుతెలియని వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. గురువారం తెల్లవారుజామున ముంబైలోని ఆయన నివాసంలోకి చొరబడిన దుండగుడు కత్తితో సైఫ్‌పై దాడి చేశాడు. దీంతో ఆయన ఒంటిపై ఆరుచోట్ల గాయాలయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన లీలావతి దవాఖానకు తరలించారు.
సైఫ్ అలీఖాన్‌కు పలు చోట్ల లోతుగా గాయలయ్యాయి. వెన్నెముక పక్కన కూడా కత్తి పోట్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. తెల్లవారుజామున 2 గంటల సమయంలో దుండగుడు దొంగతనానికి యత్నించాడని, ఈ క్రమంలోనే సైఫ్‌పై దాడి జరిగినట్లు వెల్లడించారు. 3.30 గంటలకు ఆయనను దవాఖానకు తరలించారని చెప్పారు. ప్రస్తుతం వైద్యులు ఆయనకు సర్జరీ చేస్తున్నారు. అయితే సైఫ్ అలీఖాన్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. అతడిని చూడటానికి అతడి (మొదటి భార్య) పిల్లలు సారా అలీఖాన్, ఇబ్రహీం అలీఖాన్ ఆసుపత్రికి చేరుకున్నారు. తండ్రిపై దాడి జరిగిన విషయాన్ని తెలుసుకున్న సారా, ఇబ్రహీం హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింటా వైరల్‌గా మారాయి.
#SaraAliKhan and #IbrahimAliKhan arrive at Lilavati hospital to visit dad #SaifAliKhan.#FilmfareLens pic.twitter.com/HjWoUm4gX8
— Filmfare (@filmfare) January 16, 2025
Also Read..