Hindenburg Research | ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ గ్రూప్‌పై (Adani Group) సంచలన ఆరోపణలతో వార్తల్లో నిలిచిన అమెరికాకు చెందిన షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ (Hindenburg Research) మూతపడిన విషయం తెలిసిందే. బడా వ్యాపార సంస్థలకు వణకుపుట్టించిన ఈ సంస్థకు ‘హిండెన్‌బర్గ్’ అన్న పేరు ఎలా వచ్చిందో తెలుసా..?
‘హిండెన్‌బర్గ్’ అనేది జర్మనీకి చెందిన ప్రయాణికుల హైడ్రోజన్ ఎయిర్ షిప్ పేరు. 1937లో అమెరికాలోని న్యూజెర్సీలో ప్రమాదానికి గురైంది. 35 మంది మరణించారు. ఈ ప్రమాదానికి కారణం మానవ తప్పిదమే అని తర్వాత దర్యాప్తులో తేలింది. ఈ ఉదంతాన్ని ఉటంకిస్తూ.. హిండెన్‌బర్గ్ పేరును తమ సంస్థకు పెట్టడానికి గల కారణాన్ని అండర్సన్ వెబ్సైట్లో ఇలా వివరించారు.
‘హిండెన్బర్గ్ఎయిర్ షిప్ దుర్ఘటన పూర్తిగా మానవుడు సృష్టించిన విపత్తు. మండే స్వభావం ఉన్న హైడ్రోజన్ నింపిన బెలూన్‌లో 100 మందిని ఎక్కించారు. గతంలో ఇలాంటి ఎయిర్‌షిప్‌లకు ప్రమాదాలు జరిగినా.. నిర్వాహకులు పట్టించుకోలేదు. మేము కూడా మానవులు ఉద్దేశపూర్వకంగా సృష్టించిన విపత్తులు మార్కెట్లో తిరుగుతుంటే వాటిని అన్వేషిస్తాం. అవి బాధితులను ఆకర్షించడానికి ముందే వాటిని వెలుగులోకి తీసుకొస్తాం’ అని తెలిపారు.
Also Read..
Hindenburg Research | గురి పెడితే మటాషే.. ఏమిటీ హిండెన్‌బర్గ్..?
Hindenburg Research | అదానీపై సంచలన ఆరోపణలు చేసిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ మూసివేత
Repo Rate | వడ్డీరేట్లు తగ్గితేనే వృద్ధి.. ఆలస్యమైతే ఆర్థిక వ్యవస్థకు నష్టమే: డ్యూషే బ్యాంక్