Joe Biden: సంపన్నుల ఆధిపత్యంపై జో బైడెన్ ఆందోళన
Joe Biden: అమెరికాలో సంపన్నుల ఆధిపత్యం పెరుగుతోందని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ వార్నింగ్ ఇచ్చారు. అది ప్రమాదకరంగా మారుతోందన్నారు. జో బైడెన్ నుంచి మరికొన్ని రోజుల్లో కొత్తగా ఎన్నికైన ట్రంప్ దేశాధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో బైడెన్ చివరి ప్రసంగం చేశారు.
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden).. ఫేర్వెల్ ప్రసంగం చేశారు. అమెరికాలో సంపన్నుల ఆధిపత్యం పెరుగుతోందని వార్నింగ్ ఇచ్చారు. అది ప్రమాదకరంగా మారుతోందన్నారు. దశాబ్ధాల రాజకీయ కెరీర్‌కు స్వస్తి పలుకుతూ.. బైడెన్ మీడియాతో మాట్లాడారు. అత్యంత సంపన్నమైన, శక్తివంతమైన, ప్రభావంతమైన వ్యక్తుల చేతుల్లో అధికారం ఉన్నదని, ఇది యావత్తు ప్రజాస్వామ్యానికి ప్రమాదంగా మారుతోందని, మన ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛకు భంగం కలుగుతోందని బైడెన్ ఆందోళన వ్యక్తం చేశారు. 82 ఏళ్ల బైడెన్ శ్వేతసౌధం నుంచి చివరి టీవీ ప్రసంగం చేశారు. వాతావరణ మార్పులు, సోషల్ మీడియా దుష్ ప్రచారంపై వార్నింగ్ ఇచ్చారు.
తన సింగిల్ టర్మ్ పాలనలో సాధించిన ఘనతల గురించి ఆయన వివరించారు. ఉద్యోగాల కల్పన, మౌళికసదుపాయాలపై ఖర్చు, ఆరోగ్య పరిరక్షణ, కోవిడ్ నుంచి బయటపడడం, మళ్లీ దేశాన్ని నెంబర్ వన్ స్థానంలో ఎలా నిలిపారన్న అంశాలను ఆయన తన ప్రసంగంలో చెప్పారు. తాము చేసిన పని ఫలితాలు అందాలంటే ఇంకా సమయం పడుతుందన్నారు. మేం విత్తనాలు నాటామని, అవి పెరుగుతాయని, కొన్ని దశాబ్ధాల పాటు ఆ పుష్పాలు వికసిస్తాయన్నారు.
అమెరికా ప్రజలపై సమాచార దాడి జరుగుతోందని, తప్పుడు సమాచారం ప్రచారం ఎక్కువగా ఉందని, దీంతో అధికార దుర్వినియోగం జరుగుతోందన్నారు. మెటా లాంటి సోషల్ మీడియా కంపెనీలను ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. సోషల్ మీడియాలో ఫ్యాక్ట్ చెకింగ్ జరగడం లేదన్నారు. అబద్ధాలతో నిజాన్ని కప్పిపుచ్చుతున్నారన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Amitabh Bachchan | బుల్లెట్ ప్రూఫ్ కవచం వెనుక అమితాబ్ బచ్చన్.. అభిమానుల కోసం భద్రత నడుమే ప్రత్యేక దర్శనం!
Mamitha Baiju | మమితా బైజు అసలు పేరు నమితనా? బర్త్ సర్టిఫికెట్లో జరిగిన పొరపాటుతో పేరు ఎలా మారిందో తెలుసా?
Plane Crash | ట్రంప్ నివాసానికి సమీపంలో కుప్పకూలిన ప్రైవేట్ జెట్.. తొమ్మిది మంది మృతి
Cyclone Murasu | తీవ్ర తుపానుగా బలపడిన ‘మురాసు’.. ఏపీ తీరానికి పొంచి ఉన్న పెను ముప్పు!
గ్లామర్ డోస్ పెంచేసిన హెబ్బా పటేల్.. బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బోల్డ్ ఫొటోషూట్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

