Aamir Khan – Lokesh Kanagaraj | బాలీవుడ్ ఖాన్లంతా మళ్లీ సౌత్ బాట పడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే షారుఖ్ ఖాన్ అట్లీతో కలిసి జవాన్‌తో బ్లాక్ బస్టర్ అందుకోగా.. కండలవీరుడు సల్మాన్ ఖాన్ మురుగుదాస్‌తో కలిసి సికిందర్ అనే మూవీ చేస్తున్నాడు. అయితే ఈ లిస్ట్‌లోకి మరో ఖాన్ రాబోతున్నట్లు తెలుస్తుంది. బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ ఆమీర్ ఖాన్ మళ్లీ సౌత్ దర్శకుడితో చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరో కాదు. ఖైదీ, విక్రమ్, మాస్టర్, లియో లాంటి బ్లాక్ బస్టర్లు అందుకున్న తమిళ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్.
ఆమీర్ ఖాన్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ లోకేష్ కనగరాజ్‌తో చేయబోతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తుంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అధికారిక ప్రకటనతో పాటు మిగతా వివరాలను చిత్రబృందం వెల్లడించనున్నట్లు సమాచారం. మరోవైపు ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ నిర్మించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ ప్రాజెక్ట్‌కి మాయావి అనే టైటిల్ అనుకుంటుండగా ఇందులో అమీర్ సూపర్ హీరో పాత్రలో నటించనున్నట్లు టాక్. ఈ చిత్రాన్ని 2027 క్రిస్మస్కి తీసుకురాబోతున్నారు.
ఇక ఆమీర్ ఖాన్ ప్రస్తుతం తారే జమీన్ పర్ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్నా సితారే జమీన్ పర్ అనే సినిమాలో నటిస్తుండగా.. లోకేష్ కనగరాజ్ రజినికాంత్‌తో కలిసి కూలీ అనే సినిమా షూటింగ్లో బిజీ ఉన్నాడు.
.#MAYAVI: ⭐ ing #AamirKhan
Dir: #LokeshKanagaraj
Pro: #MythriMovieMakers #Disney pic.twitter.com/EClI2CHiIo— Ryz (@suriyaEra) January 15, 2025