వరంగల్ : సులువుగా డబ్బులు సంపాదించాలని ఆ జంట అక్రమార్గాన్ని ఎంచుకుంది. అమాయకులకు వల వేస్తూ సైబర్ నేరాలకు(Cyber crimes) పాల్పడుతున్న దంపతులను వరంగల్(Warangal) పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తమిళనాడుకు(Thamilanadu) చెందిన జసిల్, ప్రీతి అనే దంపతులు కొద్ది రోజులుగా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. పక్కా సమాచారంతో వలపన్ని నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
వీరు 15 కేసుల్లో రూ.3 కోట్లకు పైగా దోచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల వద్ద నుంచి క్రెడిట్, డెబిట్ కార్డులు, పెన్‌డ్రైవ్‌లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఎవరైనా అపరిచితులు ఫోన్, ఓటీపీ నెంబర్లు అడిగితే ఇవ్వొద్దని సూచించారు. అనుమానం వచ్చిన వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలన్నారు.
Deepika Padukone | దీపికా పదుకొనే ఖాతాలో మరో ఖరీదైన విల్లా.. ఇంతకీ ఎక్కడో తెలుసా?
Nayan Sarika | సౌతిండియన్ను కాదని తెలిసి అల్లు అర్జున్ షాకయ్యారు.. ఆయ్ భామ నయన్ సారిక
Devara | తారక్-జాన్వీకపూర్ మాస్ డ్యుయెట్.. దేవర థర్డ్ సాంగ్ ఇదే
Kanguva | ఆ వార్తలే నిజమయ్యాయి.. కంగువ వాయిదాపై సూర్య క్లారిటీ