Deepika Padukone | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాప్ స్టార్ యాక్టర్లలో ఒకరు బీటౌన్ భామ దీపికా పదుకొనే (Deepika Padukone). రన్ వీర్ సింగ్-దీపికాపదుకొనే దంపతులు త్వరలోనే మొదటి సంతానానికి స్వాగతం పలుకబోతున్నారని తెలిసిందే. ఇదిలా ఉంటే దీపికాపదుకొనే ఆసక్తికర అప్డేట్తో వార్తల్లో నిలిచింది. ముంబై సర్కిల్లో రౌండప్ చేస్తున్న కథనాల ప్రకారం దీపికాపదుకొనే ఖరీదైన విల్లాను కొనుగోలు చేసింది.
11,266 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ అపార్ట్మెంట్ బాలీవుడ్ స్టార్ యాక్టర్ షారుఖ్ ఖాన్ నివాసమైన మన్నత్‌కు సమీపంలో ఉండటం విశేషం. ఈ భవంతి ఖరీదు రూ.100 కోట్లని అంచనా. ఈ నాలుగంతస్తుల భవనం దీపికాపదుకొనే అభిరుచులకు అనుగుణంగా డిజైన్ చేసుకుందట. త్వరలోనే ఈ ఇంట్లోకి మారనున్నట్టు వార్త కూడా నెట్టింట వైరల్ అవుతోంది.
చాలా ఏండ్లుగా వన్ ఆఫ్ ది లీడింగ్ స్టార్‌గా కొనసాగుతున్న దీపికాపదుకొనే.. మరోవైపు రియల్ ఎస్టేట్‌లో కూడా పెట్టుబడులు పెట్టిందని తెలిసిందే. రెండేళ్ల క్రితం ముంబైలో రూ.22 కోట్లతో బంగ్లాను కూడా కొనుగోలు చేసింది. కానీ తాజాగా కొన్న నాలుగంతస్థుల అపార్ట్మెంట్ ముంబైలో ఉన్న అత్యంత ఖరీదైన భవంతుల్లో ఒకటని బాలీవుడ్ సర్కిల్ సమాచారం.
Nayan Sarika | సౌతిండియన్ను కాదని తెలిసి అల్లు అర్జున్ షాకయ్యారు.. ఆయ్ భామ నయన్ సారిక
Devara | తారక్-జాన్వీకపూర్ మాస్ డ్యుయెట్.. దేవర థర్డ్ సాంగ్ ఇదే
Kanguva | ఆ వార్తలే నిజమయ్యాయి.. కంగువ వాయిదాపై సూర్య క్లారిటీ