35 Chinna Katha Kaadu | కేరళకుట్టి నివేదా థామస్ (Nivetha Thomas), విశ్వదేవ్ లీడ్ రోల్స్‌లో నటిస్తోన్న చిత్రం 35- చిన్న కథ కాదు (35 Chinna Katha Kaadu). నందకిశోర్ (డెబ్యూ డైరెక్టర్) దర్శకత్వం వహిస్తన్ను ఈ మూవీలో ప్రియదర్శి కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీని సెప్టెంబర్ 6న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు తెలియజేస్తూ విడుదల చేసిన పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.
మొట్టికాయలేస్తెనే మోటివేషన్ వస్తుందిరా..అంటూ స్కూల్ విద్యార్థితో ప్రియదర్శి మాస్టర్ చెబుతున్న సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. నివేదా థామస్ సరస్వతి అనే సాధారణ గృహిణి పాత్రలో నటిస్తుంది. తన భర్త, ఇల్లు, పిల్లల చదువు చుట్టూ సినిమా సాగనుందని ట్రైలర్‌తో అర్థమవుతోంది. తిరుపతి బ్యాక్‌డ్రాప్‌లో చిన్న కుటుంబం చుట్టూ తిరిగే కథాంశంతో సినిమా ఉండబోతున్నట్టు ట్రైలర్ ద్వారా క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్.
ఈ మూవీలో నివేదా థామస్ ఇదివరకెన్నడూ కనిపించని విధంగా సంప్రదాయక చీరకట్టులో తెలుగుదనం ఉట్టిపడేలా కనిపించబోతున్నట్టు సినిమా ట్రైలర్ చెబుతోంది. విలువే లేని సున్నా పక్కన ఒకటి వేస్తే పది.. 9 కన్నా పెద్దదని ఎట్లా చెప్తరు.. అంటూ నివేదా థామస్ అడిగే ప్రశ్నతో సాగే టీజర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. ఈ చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రానా దగ్గుబాటి సమర్పిస్తుండగా.. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు.
35 చిన్న కథ కాదు ట్రైలర్..
Nostalgic School Memories 📕👨🏫🧑🏫https://t.co/UxFBPWIAXR#35Movie Trailer Out Now @i_nivethathomas @PriyadarshiPN @RanaDaggubati #35CKK #35ChinnaKathaKaadu pic.twitter.com/RznjRKuU2g
— BA Raju’s Team (@baraju_SuperHit) September 1, 2024
Devara | తారక్-జాన్వీకపూర్ మాస్ డ్యుయెట్.. దేవర థర్డ్ సాంగ్ ఇదే
Kanguva | ఆ వార్తలే నిజమయ్యాయి.. కంగువ వాయిదాపై సూర్య క్లారిటీ
Indian 2 | ఇండియన్ 2 టీంకు షాక్.. మల్టీప్లెక్స్ అసోసియేషన్ లీగల్ నోటీసులు..!