Indian 2 | కమల్‌హాసన్ (Kamal Haasan) టైటిల్ రోల్లో నటించిన చిత్రం ఇండియన్ 2 (Indian 2). స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) దర్శకత్వం వహించాడు. జులై 12న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. తెలుగులో భారతీయుడు 2గా, హిందీలో హిందూస్తానీ 2గా విడుదలైంది.
అయితే ఇండియన్ 2 టీంకు ఊహించని షాక్ తగిలింది. స్ట్రీమింగ్ టైమ్ లైన్ నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా ఇండియన్ 2 టీంకు మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా లీగల్ నోటీసులు జారీ చేసింది. జులై 12న థియేటర్లలో విడుదలైన ఇండియన్ 2 నిబంధనల ప్రకారం (హిందీలో) ఓటీటీలోకి రావాలంటే కనీసం 8 వారాల సమయం ఉండాలి. దీనికి విరుద్దంగా ఆగస్టు 9న (నెలలోపే) నెట్‌ఫ్లిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.
ఈ నియమాన్ని పాటిస్తే నిర్మాతలకు PVRInox, Cinepolis వంటి ప్రధాన జాతీయ మల్టీప్లెక్స్ చైన్లలో విడుదల చేసే అవకాశం ఉండదు. అయితే ఇండియన్ 2 టీమ్ మొదట ఈ షరతులకు అంగీకరించిప్పటికీ మల్టీప్లెక్స్‌లలో సినిమా స్క్రీనింగ్ అయింది. హిందీలో సినిమాలకు తప్పనిసరిగా థ్రియాట్రికల్, ఓటీటీ విడుదలలకు కనీసం 8 వారాల వ్యవధి ఉండాలని మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలను రూపొందించింది. కానీ హిందుస్తానీ 2 ముందే నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుండటంతో.. ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. మరి దీనిపై కమల్ హాసన్ టీం ఎలా స్పందిస్తుందనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Emergency | కంగనారనౌత్ ఎమర్జెన్సీ విడుదలపై నిషేధం..?
COURT | నాని-ప్రియదర్శి ఇంట్రెస్టింగ్.. కోర్ట్ మోషన్ పోస్టర్ వైరల్
Saripodhaa Sanivaaram | నాని-వివేక్ ఆత్రేయ సరిపోదా శనివారంపై నెటిజన్ల టాక్ ఎలా ఉందంటే..?
Sreeleela | కోలీవుడ్ ఎంట్రీకి శ్రీలీల రెడీ.. ఏ స్టార్ హీరోతోనంటే..?