COURT | తమ యాక్టింగ్‌తో సూపర్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న టాలీవుడ్ యాక్టర్లలో ముందువరుసలో ఉంటారు నాని (Nani), , ప్రియదర్శి (Priyadarshi). ఈ ఇద్దరు క్రేజీ యాక్టర్ల కాంబోలో సినిమా వస్తే ఎలా ఉంటుంది. ఇప్పుడలాంటి వార్తే బయటకు వచ్చింది. ఈ ఇద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం కోర్ట్. అయితే ఈ సినిమాకు నాని సమర్పకుడిగా మాత్రమే వ్యవహరిస్తున్నాడు.
ప్రియదర్శి లీడ్ రోల్లో నటిస్తోన్న తాజా ప్రాజెక్ట్ కోర్ట్. State vs A Nobody ట్యాగ్‌లైన్‌తో వస్తోన్న ఈ చిత్రానికి రామ్ జగదీష్ దర్శకత్వం వహిస్తున్నాడు. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి త్రిపిరినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కోస్టల్ ఏరియా, డాక్యుమెంట్స్, కోర్టు బోను, న్యాయ దేవత లాంటి విజువల్స్‌తో డిజైన్ చేసిన మోషన్ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది.
ఈ చిత్రంలో నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలపై చిత్రయూనిట్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ఇటీవలే డార్లింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా.. ఆశించిన స్థాయిలో స్పందన రాబట్టుకోలేకపోయింది. ఇక నాని నటించిన తాజా చిత్రం సరిపోదా శనివారం మిక్స్డ్ టాక్‌తో స్క్రీనింగ్ అవుతోంది.
Natural Star @NameisNani Presents#COURT – ‘State vs A Nobody’ ⚖️
Motion Poster Out Now!
▶️ https://t.co/iQzOOA6nhHStarring @PriyadarshiPN
Directed by #RamJagadeesh pic.twitter.com/UnO7hJNYGG
— BA Raju’s Team (@baraju_SuperHit) August 30, 2024
కోర్ట్ మోషన్ పోస్టర్..
Saripodhaa Sanivaaram | నాని-వివేక్ ఆత్రేయ సరిపోదా శనివారంపై నెటిజన్ల టాక్ ఎలా ఉందంటే..?
Sreeleela | కోలీవుడ్ ఎంట్రీకి శ్రీలీల రెడీ.. ఏ స్టార్ హీరోతోనంటే..?
Coolie | రజినీకాంత్ కూలీలో మంజుమ్మెల్ బాయ్స్ నటుడు.. ఇంతకీ పాత్రేంటో మరి..?
Vettaiyan | వెట్టైయాన్ ఫినిషింగ్ టచ్.. తలైవా టీం కొత్త అప్డేట్ ఇదే..!