Sreeleela | తక్కువ టైంలోనే స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ టాలీవుడ్లో వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్గా కొనసాగుతోంది శ్రీలీల (Sreeleela). ఎప్పుడూ ఏదో ఒక అప్డేట్తో నిత్యం వార్తల్లో నిలిచే శ్రీలీల ఇక కోలీవుడ్‌లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతుందన్న అప్డేట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. తాజా టాక్ ప్రకారం కోలీవుడ్ స్టార్ యాక్టర్ శివకార్తికేయన్ సినిమాతో తమిళ చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వనుంది.
శ్రీలీల నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ సుధా కొంగర డైరెక్షన్లో రాబోతున్న Puranaanooru సినిమాతో కోలీవుడ్ డెబ్యూ ఇవ్వబోతుందని సమాచారం. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ ఇటీవలే హీరోహీరోయిన్లపై ఫొటోషూట్ కూడా చేశారట. ఇదే నిజమైతే శివకార్తికేయన్ సినిమాతో తమిళ సినీ పరిశ్రమ ఎంట్రీ శ్రీలీలకు బాగా కలిసొస్తుందంటున్నారు సినీ జనాలు.
శ్రీలీల మరోవైపు బల్విందర్ సింగ్ డైరెక్షన్లో ఫ్యామిలీ ఎంటర్టైనర్ మిట్టితో బాలీవుడ్‌తో తొలి సినిమా చేయబోతుందన్న టాక్ కూడా జోరుగా నడుస్తోంది. మిట్టీ బాలీవుడ్ స్టార్ యాక్టర్ సిద్దార్థ్ మల్హోత్రాతో కలిసి రొమాన్స్ చేయబోతుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి.
బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది శ్రీలీల. ఈ భామ పవన్ కల్యాణ్ టైటిల్ రోల్లో నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్‌లో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. మరోవైపు నితిన్‌తో రాబిన్ హుడ్ సినిమా చేస్తోంది. రవితేజ ప్రతిష్టాత్మక సినిమా ఆర్టీ 75లో కూడా నటిస్తోంది.
Saripodhaa Sanivaaram | నాని-వివేక్ ఆత్రేయ సరిపోదా శనివారంపై నెటిజన్ల టాక్ ఎలా ఉందంటే..?
Coolie | రజినీకాంత్ కూలీలో మంజుమ్మెల్ బాయ్స్ నటుడు.. ఇంతకీ పాత్రేంటో మరి..?
Vettaiyan | వెట్టైయాన్ ఫినిషింగ్ టచ్.. తలైవా టీం కొత్త అప్డేట్ ఇదే..!
Nani | నాని సరిపోదా శనివారం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు..!
“SreeLeela | అభినయం, అందంతో ఆకట్టుకుంటున్న శ్రీలీల కొత్త ఫొటోలు”