Vettaiyan | తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ (Rajinikanth) నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి వెట్టైయాన్ (Vettaiyan)జై భీమ్ ఫేం టీజే జ్ఞానవేళ్ (TJ Gnanavel) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా తలైవా టీం ఫినిషింగ్ అప్డేట్ అందించింది.
వెట్టైయాన్ షూటింగ్ పూర్తయింది. ప్యాచ్ వర్క్‌తోపాటు చిత్రీకరణ పూర్తయిన సందర్భంగా చిత్రయూనిట్ దిగిన స్టిల్ నెట్టింట వైరల్ అవుతోంది. తలైవా టీం ఇక ప్రమోషనల్ క్యాంపెయిన్‌పై ఫోకస్ పెట్టనుంది. తాజా సమాచారం ప్రకారం త్వరలోనే ఫస్ట్ సింగిల్ రాబోతుంది. అక్టోబర్ 10న గ్రాండ్‌గా విడుదల కానుంది. రెడీగా ఉండండి.. అంటూ మేకర్స్ అందించిన అప్డేట్తో ఫుల్ ఖుషీ అవుతున్నారు తలైవా అభిమానులు.
వెట్టైయాన్ నుంచి ఇప్పటికే ఫహద్ ఫాసిల్ లుక్ విడుదల చేయగా.. కాలేజ్ స్టూడెంట్‌లా బ్యాగ్ వేసుకొని హాయ్ చెప్తున్న స్టిల్ నెట్టింట వైరల్ అవుతోంది. వెట్టైయాన్ లో దుషారా విజయన్, రితికా సింగ్ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. మంజు వారియర్, రానా దగ్గుబాటి, రావు రమేశ్, రోహిణి మొల్లేటి ఇతర పాత్రలు పోషిస్తున్నారు.
మేకర్స్ ఇప్పటికే లాంచ్ చేసిన వెట్టైయాన్ టైటిల్ టీజర్ నెట్టింట వైరల్ అవుతూ.. సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తోంది. రజినీకాంత్ మరోవైపు లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్లో కూలీ చిత్రంలో కూడా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది.
#Vettaiyan complete shoot including patch work has been completed 🎬✅
All set for Oct-10 Grand release ❤️🔥 pic.twitter.com/Ck2wBgpzDS
— AmuthaBharathi (@CinemaWithAB) August 28, 2024
The Greatest of all time | విజయ్ ది గోట్ రీసెన్సార్.. కొత్తగా ఎన్ని నిమిషాలు యాడ్ చేశారంటే..?
Nani | ఒకే ఫ్రేమ్‌లో నాని, శివరాజ్‌కుమార్.. స్పెషల్ ఏంటో తెలుసా..?
Devara | దేవర మ్యాడ్నెస్.. డిఫరెంట్ షేడ్స్‌లో తారక్ నయా లుక్ అదిరిందంతే..!