The Greatest of all time | కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Thalapathy Vijay) నటిస్తోన్న తాజా చిత్రం ది గోట్ (The Greatest Of All Time). వెంకట్ ప్రభు (Venkat Prabhu) దర్శకత్వం వహిస్తున్నాడు. The GOAT నుంచి మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన పోస్టర్లు సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సెన్సార్‌కు సంబంధించిన ఆసక్తిక వార్త ఒకటి బయటకు వచ్చింది.
ముందుగా సెన్సార్ బోర్డు నిర్ణయించిన ప్రకారం ది గోట్ రన్ టైం 2 గంటల 59 నిమిషాలు. కాగా ఇప్పుడు సీబీఎఫ్సీ రీసెన్సార్ చేసిందని సమాచారం. తాజా అప్డేట్ ప్రకారం సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి మరో 5నిమిషాలు యాడ్ చేసిందట. ఈ నిడివితో సినిమా రన్‌టైం మొత్తం 3 గంటల 3 నిమిషాల 14 సెకన్లకు చేరినట్టు ఇన్సైడ్ టాక్. విజయ్ నటించిన నన్బన్ (3 గంటల 8 నిమిషాలు) తర్వాత రెండో లాంగ్ రన్‌టైం కలిగిన సినిమాగా నిలిచింది ది గోట్.
ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రశాంత్, అజ్మల్ అమీర్, వైభవ్, ప్రభుదేవా, స్నేహ, లైలా, యోగిబాబు మిక్ మోహన్, జయరాం ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ మూవీకి యువన్ శంకర్ రాజా మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
Nani | ఒకే ఫ్రేమ్‌లో నాని, శివరాజ్‌కుమార్.. స్పెషల్ ఏంటో తెలుసా..?
Devara | దేవర మ్యాడ్నెస్.. డిఫరెంట్ షేడ్స్‌లో తారక్ నయా లుక్ అదిరిందంతే..!
Lal Salaam | సస్పెన్స్ వీడింది.. ఫైనల్‌గా ఓటీటీలోకి రజినీకాంత్ లాల్ సలామ్..!