Lal Salaam | తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం లాల్‌సలామ్ (Lal Salaam). ఐశ్వర్య రజినీకాంత్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఫిబ్రవరి 9న భారీ అంచనాల మధ్య రిలీజ్ కాగా.. ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. సినిమా థియేటర్లలోకి వచ్చి ఆరు నెలలు దాటినప్పటికీ డిజిటమ్ ప్లాట్‌ఫాంలో ఎప్పుడు వస్తుందనేది మాత్రం సస్పెన్స్ నెలకొంది.
చాలా కాలానికి ఆ సస్పెన్స్‌కు తెరపడింది. లాల్ సలామ్ ఫైనల్‌గా సన్‌నెక్ట్స్‌లో ప్రీమియర్ కానున్నట్టు ఇన్సైడ్ టాక్ . సెప్టెంబర్ 20 నుంచి లాల్ సలామ్ సన్ నెక్ట్స్‌లో స్ట్రీమింగ్ కాబోతుండగా.. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరణ్ తెరకెక్కించగా.. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. ‘3’ మూవీతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చిన ఐశ్వర్య రజినీకాంత్. ఆ తర్వాత ‘వాయ్ రాజా వాయ్’, ‘సినిమా వీరన్’ సినిమాలు తెరకెక్కించిన విషయం తెలిసిందే.
చాలా కాలం తర్వాత తండ్రీకూతుళ్ల కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ టాక్ మూటగట్టుకోవడంతో అభిమానులంతా నిరాశలో మునిగిపోయారు. లాల్ సలామ్ మరి ఓటీటీలోనే ఎలాంటి స్పందన రాబట్టుకుంటుందనేది చూడాలి. రజినీకాంత్ ప్రస్తుతం జై భీమ్ ఫేం టీజే జ్ఞానవేళ్ దర్శకత్వంలో వెట్టైయాన్ చేస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మరోవైపు లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్లో కూలి చిత్రంలో కూడా నటిస్తున్నాడు.
#LalSaalam Fan Made Poster For OTT ❓ pic.twitter.com/xZyyijhXjs
— Kolly Corner (@kollycorner) August 27, 2024
Sikandar | సల్మాన్ ఖాన్ సికిందర్ మారథాన్ షెడ్యూల్ షురూ.. ఎక్కడంటే..?
Priyadarshi | సారంగపాణి జాతకం సెట్స్‌లో కేక్ కట్ చేసిన ప్రియదర్శి.. స్పెషల్ ఇదే
Game Changer | ఫైనల్‌గా రాంచరణ్ గేమ్‌ఛేంజర్ విడుదల తేదీపై క్లారిటీ.. ఎప్పుడో తెలుసా..?
Saripodhaa Sanivaaram | సరిపోదా శనివారం ప్రీ సేల్స్.. నాని తన రికార్డు తానే బ్రేక్ చేస్తాడా..?