Sikandar | బాలీవుడ్ స్టార్ యాక్టర్ సల్మాన్ ఖాన్ (Salman Khan) కాంపౌండ్ నుంచి వస్తోన్న మోస్ట్ అవెయిటెడ్ ప్రాజెక్ట్ ‘సికందర్’ (Sikandar). కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ (AR Murugadoss) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని నడియాద్వాలా గ్రాండ్సన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సాజిద్ నడియాద్వాలా నిర్మిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 2025 ఈద్ కానుకగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఆగస్టు 26న ముంబైలో యాక్షన్ ప్యాక్డ్ షెడ్యూల్ షురూ కానుందంటూ అప్డేట్ ఒకటి నెట్టింట రౌండప్ చేస్తోంది. అన్నట్టుగానే ఈ సినిమాపై ఆసక్తికర అప్డేట్ తెరపైకి వచ్చింది. ముంబైలో ఇవాళ మారథాన్ షెడ్యూల్ మొదలైంది. 45 రోజులపాటు ఈ షెడ్యూల్ కొనసాగనుంది. ఈ చిత్రంలో సామాజిక సందేశంతోపాటు హై ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలుండబోతున్నట్టు బీటౌన్ సర్కిల్ సమాచారం. సల్మాన్ ఖాన్ సికిందర్ గ్లింప్స్ ఆన్ ది వే అంటూ మరో వార్త వైరల్ అవుతోంది.
సికిందర్లో సత్యరాజ్ విలన్‌గా నటిస్తున్నాడు. జూన్‌లో ముంబైలోని మెహబూబ్ స్టూడియోస్‌లో ముహూర్తపు షాట్‌తో సికిందర్ షూటింగ్ షురూ అవగా.. ఫస్ట్ షెడ్యూల్లో సల్మాన్ ఖాన్ అండ్ టీంపై ఏరియల్ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించినట్టు ఇప్పటికే వార్తలు బయటకు వచ్చాయని తెలిసిందే. ఓ వైపు గ్లింప్స్, మరోవైపు మారథాన్ షెడ్యూల్ అంటూ వార్తలు రావడంతో ఫుల్ ఖుషీ అవుతున్నారు అభిమానులు.
Megastar #SalmanKhan to kick start a 45-day marathon schedule of #Sikandar in Mumbai today. #36YearsOfSalmanKhanEra pic.twitter.com/dZbBTZc8vb
— MASS (@Freak4Salman) August 26, 2024
Priyadarshi | సారంగపాణి జాతకం సెట్స్‌లో కేక్ కట్ చేసిన ప్రియదర్శి.. స్పెషల్ ఇదే