Gabbar Singh 4K | సెప్టెంబర్ 2న టాలీవుడ్ యాక్టర్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) బర్త్ డేను ఘనంగా నిర్వహించేందుకు అభిమానులు సన్నాహాలు చేస్తున్నారు. బర్త్ డే ట్రీట్‌గా మూవీ లవర్స్ కోసం సెప్టెంబర్ 1న గబ్బర్ సింగ్ 4k (Gabbar Singh 4k) రీరిలీజ్ చేస్తున్నారని తెలిసిందే. లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ కల్యాణ్‌కు గబ్బర్ సింగ్ రూపంలో గ్రాండ్ సక్సెస్ అందించాడు హరీష్ శంకర్.
దబాంగ్‌కు రీమేక్‌గా బండ్ల గణేశ్ నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొట్టింది. గబ్బర్ సింగ్ రీరిలీజ్ టైంలో కూడా సేమ్ మేనియాను కొనసాగిస్తోంది. ఈ చిత్రంలో నార్త్ అమెరికాలో 100+ లొకేషన్లకుపైగా విడుదలకు ప్లాన్ చేస్తున్నారని.. సెప్టెంబర్ 1న యూఎస్ఏ, కెనడాలో హాలీడే కావడం వల్ల ఓపెనింగ్ డేన రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టడం ఖాయమని ఇప్పటికే ఓ వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది.
యూఎస్ఏలో గబ్బర్ సింగ్ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ అయ్యాయి. ఇప్పటివరకు వచ్చిన సమాచారం ప్రకారం రీరిలీజ్ సినిమాల్లో ఆల్ టైమ్ హయ్యెస్ట్ గ్రాస్ సాధించిన తెలుగు సినిమాగా చోటు సంపాదించే దిశగా ముందుకెళ్తోంది. గబ్బర్ సింగ్ ఇటీవలే చిరంజీవి ఇంద్ర రీలిజ్ ట్రెండ్‌ను అధిగమిస్తుండటం విశేషం. గబ్బర్ సింగ్ ఇప్పటివరకు నార్త్ అమెరికాలో 55 స్రీన్లలో రూ.12,57,178.50 లక్షలు సేల్స్ నమోదు చేసింది.
గబ్బర్ సింగ్‌లో శృతి హాసన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటించగా.. బ్రహ్మానందం, కోట శ్రీనివాస రావు, అభిమన్యు సింగ్ కీలక పాత్రలు పోషించారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ అదిరిపోయే ఆల్బమ్ అందించాడు.
Toofan | ఓటీటీలోకి విజయ్ ఆంటోనీ తుఫాన్.. ఏ ప్లాట్ఫాంలోనంటే..?
Raayan | రాయన్ సక్సెస్ ట్రీట్.. ధనుష్‌కు ఒకేసారి రెండు చెక్కులు