They Call Him OG | టాలీవుడ్ యాక్టర్, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సినిమాల విషయంలో బ్రేక్ తీసుకున్నారని తెలిసిందే. త్వరలోనే షూటింగ్స్‌లో పాల్గొనబోతున్నాడని వార్తలు కూడా నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ప్రస్తుతం ఓజీతోపాటు ఉస్తాద్భగత్ సింగ్, హరిహరవీరమల్లు సినిమాల్లో నటిస్తున్నారు పవన్ కల్యాణ్.
ఇంతకీ ఈ స్టార్ యాక్టర్ మొదట ఏ సినిమా షూటింగ్లో పాల్గొంటారనే దానిపై స్టిల్ రూపంలో క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది. ఓజీ అండ్ స్క్వాడ్ టీం బ్యాక్ ఆన్ మిషన్.. అనే క్యాష్షన్తో పవన్ కల్యాణ్, సుజిత్, నిర్మాత డీవీవీ దానయ్య కలిసి దిగిన ఫొటోను డీవీవీ ఎంటర్టైన్మెంట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. పవన్ కల్యాణ్ ఓజీ షూటింగ్లో జాయిన్ అవబోతున్నాడని తాజా స్టిల్ చెప్పకనే చెబుతోంది. ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది.
ఇప్పటికే విడుదల చేసిన ఉస్తాద్భగత్ సింగ్ గ్లింప్స్‌తోపాటు ఓజీ Hungry cheetah వీడియోలు గూప్‌బంప్స్ తెప్పిస్తూ.. అభిమానులు ఆశించే అన్ని ఎలిమెంట్స్‌తో వినోదాన్ని అందించబోతున్నట్టు క్లారిటీ వస్తోంది. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న హరిహరవీరమల్లు చిత్రానికి సంబంధించి ఇటీవలే వార్ సీక్వెన్స్ షూట్ కొనసాగుతున్నట్టు వార్తలు కూడా వచ్చాయి.
OG & his squad… Back on a mission. 🔥#TheyCallHimOG #OG pic.twitter.com/IO9jbFfojs
— DVV Entertainment (@DVVMovies) August 22, 2024
Demonte Colony 3 | డెమోంటే కాలనీ 3 కూడా వచ్చేస్తుంది.. అప్పుడే విడుదల టైం కూడా ఫిక్స్
Kalki 2898 AD | పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ప్రభాస్ కల్కి 2898 ఏడీ.. ఏఏ భాషల్లోనంటే..?
Vishwambhara | చిరంజీవి బర్త్ డే స్పెషల్.. త్రిశూలంతో విశ్వంభర లుక్ వైరల్
Nani | ప్రభాస్‌పై కామెంట్స్‌తో పాపులర్.. అర్షద్ వర్షి వివాదంపై నాని