Demonte Colony 3| కోలీవుడ్ నుంచి హార్రర్ జోనర్లో రాబోతున్న సీక్వెల్ ప్రాజెక్ట్ ‘డెమోంటే కాలనీ 2′(Demonte Colony 2). 2015లో విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది డెమోంటే కాలనీకి కొనసాగింపుగా వస్తోన్నీ చిత్రానికి ఆర్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించాడు. అరుల్ నిధి (Arul nithi) లీడ్ రోల్లో నటించగా.. ప్రియా భవానీ శంకర్ (Priya Bhavani Shankar) ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది.
ఈ మూవీ ఆగస్టు 23న థియేటర్లలో సందడి చేయనుంది. డెమోంటే కాలనీ 2ను తెలుగులో పాపులర్ ప్రొడక్షన్ హౌజ్ మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేస్తుంది. రిలీజ్ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రమోషనల్ ఈవెంట్లో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రానికి థర్డ్ ఇన్స్టాల్మెంట్ డెమోంటే కాలనీ 3 కూడా వచ్చేస్తుందని ప్రకటించారు. అంతేకాదు మూడో పార్ట్ 2026లో విడుదల కానుందని తెలియజేశారు. సీక్వెల్ విడుదలకు ముందే మూడో పార్ట్‌ను కూడా ప్రకటించేసి అంచనాలు మరింత పెంచేస్తున్నారు.
సీక్వెల్లో అరుణ్‌పాండియన్, ముత్తుకుమార్, మీనాక్షి గోవిందరాజన్, అర్చన రవిచంద్రన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే లాంచ్ చేసిన ఫస్ట్ లుక్‌తోపాటు టీజర్ కు మంచి స్పందన వస్తోంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సాగుతున్న ట్రైలర్ సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తోంది.
Vishwambhara | చిరంజీవి బర్త్ డే స్పెషల్.. త్రిశూలంతో విశ్వంభర లుక్ వైరల్
Nani | ప్రభాస్‌పై కామెంట్స్‌తో పాపులర్.. అర్షద్ వర్షి వివాదంపై నాని
Coolie | పోర్ట్ సిటీలో రజినీకాంత్ కూలీ షూట్.. తాజా షెడ్యూల్ వివరాలివే..!
Maharaja | తగ్గేదేలే అంటోన్న విజయ్‌సేతుపతి.. మహారాజ మరో రికార్డ్