Coolie | తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. తలైవా టైటిల్ రోల్లో నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి కూలీ (Coolie). కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వం వహిస్తున్నాడు. తలైవా 171 (Thalaivar171)గా వస్తోన్న కూలీ టైటిల్ టీజర్ ఇప్పటికే నెట్టింట హల్ చల్ చేస్తోంది. బంగారంతో డిజైన్ చేసిన ఆయుధాలు, వాచ్ ఛైన్లతో సూపర్ స్టార్ చేస్తున్న స్టైలిష్ ఫైట్ సన్నివేశాలు సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తున్నాయి.
తాజా టాక్ ప్రకారం కూలీ మూడో షెడ్యూల్ ఏపీలో షురూ కానుంది. వైజాగ్‌లో మంగళవారం షురూ అయినట్టు ఫిలింనగర్ సర్కిల్ సమాచారం. బీచ్ సిటీలో సుమారు 40 రోజులపాటు చిత్రీకరణ కొనసాగించనున్నారట. రజినీకాంత్, శృతిహాసన్‌తోపాటు పలువురు నటీనటులు ఈ షెడ్యూల్లో పాల్గొంటున్నట్టు ఇన్సైడ్ టాక్. గోల్డ్ అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమా షూట్ కోసం వైజాగ్ తీర ప్రాంతం, ఐకానిక్ ఫిషింగ్ హార్బర్ సరైన లొకేషన్ అని ఈ వార్త చదివన సినీ జనాలు అభిప్రాయపడుతున్నారు.
గోల్డ్ అక్రమ రవాణా నేపథ్యంలో సినిమా సాగనున్నట్టు టీజర్‌తో క్లారిటీ ఇచ్చేశాడు లోకేశ్ కనగరాజ్. జల్లికట్టు, విక్రమ్, సర్కార్ చిత్రాలకు పనిచేసిన పాపులర్ సినిమాటోగ్రాఫర్ ఈ చిత్రానికి పనిచేస్తున్నాడు. ఈ చిత్రంలో పాపులర్ నటుడు సత్యరాజ్ రజినీకాంత్ స్నేహితుడిగా కనిపించబోతున్నాడు. ఈ చిత్రంలో రజినీకాంత్ స్మగ్లర్‌గా కనిపించబోతుండగా.. లోకేశ్ కనగరాజ్ ముందుగా చెప్పినట్టుగానే తలైవా విలనిజాన్ని ఎలివేట్ చేయబోతున్నాడని టీజర్ ద్వారా అర్థమవుతోంది. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ తెరకెక్కిస్తున్నారు. మహేంద్రన్ కీ రోల్ చేస్తున్నాడు.
Maharaja | తగ్గేదేలే అంటోన్న విజయ్‌సేతుపతి.. మహారాజ మరో రికార్డ్
Mahesh Babu | ముఫాసా: ది లయన్ కింగ్‌కు మహేశ్ బాబు వాయిస్ ఓవర్.. ఇంతకీ ఏ పాత్రకో తెలుసా..?