Arshad Warsi | గ్లోబల్ స్టార్ యాక్టర్ ప్రభాస్ (prabhas)నటించిన కల్కి 2898 ఏడీ గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్లో వసూళ్లు రాబట్టిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ చిత్రంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే యాక్టింగ్‌కు మూవీ లవర్స్ ఫిదా అయిపోయారు. కాగా బాలీవుడ్ యాక్టర్ అర్షద్ వర్షి (Arshad Warsi) కల్కి సినిమాలో ప్రభాస్ నటనపై వివాదాస్పద కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచాడు.
యూట్యూబర్ చేసిన చిట్‌చాట్‌లో అర్షద్ వర్షి మాట్లాడుతూ.. కల్కి సినిమా తనకు నచ్చలేదన్న అర్షద్ వర్షి.. అమితాబ్ బచ్చన్ అసలే అర్థం కాడని.. ఈ వయసులో కల్కి లాంటి సినిమాలు ఎలా చేస్తున్నాడని అన్నాడు. అంతేకాదు ఆయనకున్న శక్తిలో తనకు కొంచెం ఉన్న లైఫ్ సెట్ అయిపోతుందని.. అతడు అసాధారణమైన వ్యక్తి అని పేర్కొన్నాడు. అయితే తనకు కల్కిలో ప్రభాస్‌ను చూస్తున్నప్పుడు బాధగా అనిపించిందని.. అమితాబ్ ముందు అతడు ఒక జోకర్ లాగా కనిపించాడు. ప్రభాస్ ఎందుకు ఇలాంటి సినిమాలు చేస్తాడు అంటూ కామెంట్ చేశాడు. దీనిపై నెట్టింట ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి.
కాగా ఈ కామెంట్స్‌పై టాలీవుడ్ నటుడు సుధీర్ బాబు (Sudheerbabu) తనదైన శైలిలో స్పందించాడు. నిర్మాణాత్మక విమర్శను స్వాగతిస్తాం. కానీ అవమానకర వ్యాఖ్యలను కాదు.. అర్షద్ వర్షికి వృతిపరమైన నైపుణ్యం లేకపోవడం పట్ల ఆశ్చర్యమేస్తుంది. ఇలాంటి చిన్న మనస్తత్వం కలిగిన వ్యక్తుల వ్యాఖ్యల కంటే ప్రభాస్‌కున్న స్థాయి చాలా ముఖ్యమైనదని చెప్పుకొచ్చాడు. మరి అర్షద్ వర్షి ఎలా స్పందిస్తాడనేది చూడాలి.
It’s okay to criticize constructively but it’s never okay to bad-mouth. Never expected the absence of professionalism from Arshad Warsi. Prabhas’s stature is too big for comments coming from small minds..
— Sudheer Babu (@isudheerbabu) August 20, 2024
Yuvaraj Singh | తెరపైకి క్రికెటర్ యువరాజ్ సింగ్ బయోపిక్.. వివరాలివే
SDGM | మాస్ ఫీస్ట్ పక్కా.. గోపీచంద్ మలినేని ఎస్డీజీఎంలో బాలీవుడ్ స్టార్ యాక్టర్..!
VidaaMuyarchi | అజిత్ కుమార్ విదాముయార్చి రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రెండింగ్‌లో పోస్టర్
Harish Shankar | త్రివిక్రమ్‌పై నాన్న చూపించే ప్రేమ చిరాకు తెప్పిస్తుంది : హరీష్ శంకర్