అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్రాంతి (Sankranthi) పండుగ సందర్భంగా ఆర్టీసీ ( RTC ) ప్రయాణికులకు తీపి కబురును అందించింది. ఆంధ్రులకు అతి పెద్ద పండుగ సంక్రాంతికి సొంతిళ్లకు వెళ్లేందుకు ప్రత్యేక బస్సులతో పాటు సాధారణ ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించింది.
ఈ సందర్భంగా రెగ్యులర్ సర్వీసులతో పాటు అదనంగా 8,432 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. వీటిలో 71 శాతం బస్సులను రాష్ట్రంలోని 71 శాతం బస్సులను రాష్ట్రంలోని పలు ప్రాంతాల మధ్య నడపాలని నిర్ణయించింది .
ఇటీవల మహిళలకు బస్సుల్లో ఉచితంగా ప్రవేశపెట్టిన స్ర్తీ శక్తి ద్వారా అధిక సంఖ్యలో మహిళలు ప్రయాణించే అవకాశమున్నందున గ్రామాలకు 6 వేల బస్సులను నడపాలని, ప్రత్యేక బస్సుల్లోనూ సాధారణ ఛార్జీలే వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది .