VidaaMuyarchi | కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajithkumar) వరుస సినిమాలతో అభిమానులకు వినోదాన్ని పంచే పనిలో బిజీగా ఉన్నాడని తెలిసిందే. ఈ స్టార్ యాక్టర్ నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి విదాముయార్చి (VidaaMuyarchi). మగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్నాడు. ఏకే 62గా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టులో త్రిష (Trisha) ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 31న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు కొత్త పోస్టర్ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుండగా.. మేకర్స్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
స్టైలిష్ బ్లాక్ గాగుల్స్ పెట్టుకున్న అజిత్ కుమార్ డ్రైవింగ్‌లో ఉన్నట్టుగా కనిపిస్తున్న లుక్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో కోలీవుడ్ నటుడు ఆరవ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇటీవలే స్టైలిష్ గాగుల్స్ పెట్టుకున్న ఆరవ్ ఓ ట్రక్కులో నుంచి దిగుతున్న లుక్ విడుదల చేయగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరోవైపు కీలక పాత్రలో నటిస్తోన్న యాక్షన్ కింగ్ అర్జున్ సార్జా రోడ్డుపై నిలబడి ఉన్న స్టైలిష్ లుక్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది.
ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడని తెలిసిందే. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో వస్తోన్న విదాముయార్చిలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ (Sanjaydutt) విలన్‌గా నటిస్తున్నాడు. అజిత్ కుమార్ దీంతోపాటు అధిక్ రవిచంద్రన్ డైరెక్షన్లో నటిస్తున్నాడు. ఏకే 63గా రాబోతున్న ఈ చిత్రానికి గుడ్ బ్యాడ్ అగ్లీ టైటిల్‌తో రానుంది.
Harish Shankar | త్రివిక్రమ్‌పై నాన్న చూపించే ప్రేమ చిరాకు తెప్పిస్తుంది : హరీష్ శంకర్
Saripodhaa Sanivaaram | నాని ఆ ఇద్దరు డైరెక్టర్లను మోటివేట్ చేశాడట.. ఎందుకో తెలుసా..?