Saripodhaa Sanivaaram | తన సహజ సిద్దమైన నటనతో కోట్లాదిమంది తెలుగు ప్రేక్షకుల మనసుల్లో నటుడిగా మంచి స్థానం సంపాదించుకున్నాడు నాని (Nani) . న్యాచురల్ స్టార్ అని పిలుచుకునే ఈ స్టార్ యాక్టర్ ప్రస్తుతం సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram) సినిమాలో నటిస్తున్నాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో గ్యాంగ్‌లీడర్ ఫేం ప్రియాంక అరుళ్ మోహన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ప్రమోషన్స్‌లో భాగంగా నాని, ఎస్జే సూర్య ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చేసిన చిట్‌చాట్‌లో ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నాడు నాని. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నటించిన అంటే సుందరానికి మిక్స్ రివ్యూస్ రాగా.. టక్ జగదీశ్‌కు బ్యాడ్ రివ్యూస్ వచ్చాయి. దీంతో ఆ ఇద్దరి దర్శకులను నా దగ్గరకు పిలిచాను. ఇండస్ట్రీలో ఉన్న ఉత్తమ స్ర్కీన్‌ప్లే రైటర్లలో వివేక్ ఒకరు. అంటే సుందరానికి విడుదలయ్యాక ఓపెనింగ్స్ ఫర్వాలేదని వివేక్ నిరాశ చెందాడు. నా దగ్గరకు పిలిచా. ఈవెనింగ్ షోలు ఎలా ఉన్నాయి. సార్ అంటే అది మ్యాటర్ కాదు.. మనమిప్పుడు మీరు ఇండియా ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ అన్న విషయాన్ని సెలబ్రేట్ చేసుకుందామని చెప్పాను.
ఇక శివనిర్వాణ దర్శకత్వం వహించిన టక్ జగదీశ్‌కు బ్యాడ్ రివ్యూస్ వచ్చాయి. అవి శివపై ఎఫెక్ట్ చూపుతాయని నాకు తెలుసు. వెంటనే నా దగ్గరకు రమ్మని పిలిచా. ఆ రోజు వినాయక చవితి. నేను అతనితో కలిసి పూజలో కూర్చున్నా.. ఇది నాకు చాలా ముఖ్యమైన విషయం.. అంటూ ఆ దర్శకులకు ఎలా సపోర్టుగా నిలిచాడో చెప్పుకొచ్చాడు నాని. ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
#Nani the GEM Hearted🫶💎
“When AnteSundaraniki had mixed reviews & TuckJagadish had bad reviews, I called both the directors to my place & motivated them♥️✨. It is more important to me”Nani has now done #SaripodaSanivaaram with AnteSundaraniki Dir🫡pic.twitter.com/rW19RxAY5g
— AmuthaBharathi (@CinemaWithAB) August 19, 2024
Priyadarshi | ప్రియదర్శి నెక్ట్స్ సినిమా టైటిల్‌పై సమ్మోహనం మేకర్స్ క్లారిటీ
Stree 2 | 4 రోజుల్లోనే రికార్డ్ వసూళ్లు.. బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న శ్రద్దాకపూర్ స్త్రీ 2
World Of Vasudev | కిరణ్ అబ్బవరం క నుంచి వరల్డ్ ఆఫ్ వాసుదేవ్ సాంగ్