Priyadarshi | తెలుగు ప్రేక్షకులకు అష్టాచమ్మా, జెంటిల్మెన్ లాంటి హిట్ చిత్రాలను అందించారు ఇంద్రగంటి మోహన కృష్ణ (Indraganti Mohana Krishna). ఈ టాలెంటెడ్ డైరెక్టర్ సమ్మోహనం మేకర్స్‌తో కలిసి మరో సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ప్రొడక్షన్ నంబర్ 15గా వస్తోన్న ఈ చిత్రాన్ని శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో లాంచ్ అయిన ఈ మూవీలో ప్రియదర్శి (Priyadarshi), రూపా కొడువయూర్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర వార్తను ప్రేక్షకులతో షేర్ చేసుకున్నారు మేకర్స్. త్వరలోనే సినిమా టైటిల్‌ను ప్రకటించబోతున్నట్టు తెలియజేస్తూ పోస్టర్ ఒకటి విడుదల చేశారు. జ్యోతిష్యం, జాతకం లాంటి అంశాల చుట్టూ తిరిగే కథాంశంతో సినిమా ఉండబోతున్నట్టు తెలియజేశారు మేకర్స్. టైటిల్ అనౌన్స్మెంట్ టైంలో పూర్తి వివరాలు వెల్లడించబోతున్నట్టు తెలియజేశారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న 15వ సినిమా ఇది.
బలగం, ఓం భీమ్ బుష్ సినిమాలతో మంచి సక్సెస్‌లను అందుకున్నాడు ప్రియదర్శి. ఇటీవలే విడుదలైన డార్లింగ్ మాత్రం నిరాశనే మిగిల్చింది. డాక్టర్ నుంచి యాక్టర్‌గా మారిన రూపా ఈ సినిమాతో హిట్ కొట్టాలని చూస్తోంది. ఓ బుడ్డోడు ఆకాశంపైకి వేలు చూపిస్తున్న స్టిల్‌లో తారలు దిగివచ్చిన వేళ అని రాసి ఉండగా.. రింగ్స్, గాగుల్స్, బైక్ తాళపు చెవులు, బూతద్దం, క్యాలెండర్‌ను చూడొచ్చు.
ఇదిగో….
‘సమ్మోహనం’గా చిత్రాలు తీసే…
‘జెంటిల్మెన్’ @krishnasivalenk– #MohanaKrishnaIndraganti
ఇప్పుడు ఇదే బ్యానర్ లో గ్రహాల అనుగ్రహంతో మీ ముందుకు తెస్తున్న #Production15 టైటిల్ ని త్వరలోనే ‘దర్శి’oచగలరు.సిద్ధంగా ఉండండి!! pic.twitter.com/WREOnMCrHD
— Sridevi Movies (@SrideviMovieOff) August 19, 2024
Vettaiyan Movie | దసరా బరిలో ‘వెట్టయాన్’ .. సూర్య ‘కంగువ’కు పోటిగా తలైవర్