Megastar Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం రోజున అరుదైన ఫొటోను పంచుకున్నాడు. అప్పట్లో బ్లాక్ అండ్ వైట్ కెమెరాలో తన తండ్రిని తాను తీసిన ఫొటో అని ఇక చిత్రాన్ని పంచుకున్నాడు చిరు. ఈ ఫొటో తీసినప్పుడు అతడు హీరోలా ఉన్నాడు. నా అగ్ఫా కెమెరా ఇలాంటి అరుదైన మూమెంట్‌ని క్యాప్చర్ చేసింది. కష్టపడకుండా టైం ట్రావెల్ చేసేందుకు ఫొటోస్ మా మిషన్స్ అంటూ చిరంజీవి రాసుకోచ్చాడు. ఇక ఈ ఫొటోలో చిరు ఫాదర్ సైకిల్ పట్టుకుని బ్లాక్ గాగూల్స్లో హీరోలాగా కనిపిస్తున్నాడు.
సినిమాల విషయానికి వస్తే.. చిరు ప్రస్తుతం విశ్వంభర అనే సినిమాలో నటిస్తున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో సోషియో ఫాంటసీ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తుండగా.. కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష దాదాపు 18 ఏండ్ల తర్వాత చిరంజీవితో కలిసి ఇందులో నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం రెండు పాటలు, క్లైమాక్స్ షూట్ మిగిలిఉన్నట్లు తెలిపింది. ఈ సినిమాను 2025 సంక్రాంతి కానుకగా తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
A pic I have taken of my father
in the black and white era. He was quite the Hero, my Agfa camera cherished capturing ! 📷 Pictures are our machines for effortless Time Travel 🧭 #DownMemoryLane #WorldPhotographyDay pic.twitter.com/KHeIJ3bSBW— Chiranjeevi Konidela (@KChiruTweets) August 19, 2024