చెన్నై: తమిళనాడులోని అధికార డీఎంకే పార్టీ ఎంపీ కనిమొళి (Kanimozhi) ఆ రాష్ట్ర రాజకీయాల్లోకి రావాలని ఆసక్తిగా ఉన్నారు. త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పోటీ చేయనున్నట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో డీఎంకేలో ఆధిపత్య పోరుకు ఇది నిదర్శనమని భావిస్తున్నారు. జనవరి 5న తన పుట్టిన రోజును కనిమొళి గ్రాండ్‌గా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమె అభిమానులు ఏర్పాటు చేసిన బ్యానర్లు, విడుదల చేసిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రజా నాయకురాలిగా తమిళనాడు ప్రజలతో ఆమె మమేకమవుతున్న ఈ వీడియోలు చర్చనీయాశంమయ్యాయి.
కాగా, కరుణానిధి కుమార్తె, సీఎం స్టాలిన్ సోదరి అయిన కనిమొళి చాలా కాలంగా డీఎంకేలో ప్రభావవంతమైన వ్యక్తిగా ఉన్నారు. తూత్తుకుడి నుంచి రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. డీఎంకే మేనిఫెస్టో కమిటీకి నాయకురాలైన ఆమె లోక్‌సభలో ఆ పార్టీ పార్లమెంటరీ నాయకురాలిగా కూడా ఉన్నారు.
మరోవైపు ఇప్పటి వరకు కేంద్ర రాజకీయాలకు పరిమితమైన కనిమొళి తాజాగా రాష్ట్ర రాజకీయాలపై ఆసక్తి చూపుతున్నారు. త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో డీఎంకేలో ఆధిపత్య పోరుకు ఇది నిదర్శనమని భావిస్తున్నారు. కుమారుడు ఉదయనిధిని పార్టీ వారసుడిగా చేయాలన్న సోదరుడు స్టాలిన్ వ్యూహాలకు కనిమొళి చెక్‌పెట్టవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
HBD- அக்கா 💐🎂
பெரியார் பேத்தி @KanimozhiDMK 💪🔥🖤❤️ pic.twitter.com/fmoGJgT3bO— 𝐌.𝐌.சந்தோஷ்_𝐌.𝐀.𝐁.𝐄𝐝🏴🚩 (@santhoshmm8787) January 5, 2026
IAS officer’s rented house | ఇంటిని అద్దెకు ఇచ్చిన ఐఏఎస్ అధికారిణి.. గుట్టుగా వ్యభిచారం
Watch: రెండో భార్య కావాలంటూ.. వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి వ్యక్తి నిరసన, తర్వాత ఏం జరిగిందంటే?