భువనేశ్వర్: ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్లో కామెర్లు వ్యాపించాయి. 40 మందికి పైగా విద్యార్థులు అనారోగ్యం చెందారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రెసిడెన్షియల్ స్కూల్ నుంచి నీటి నమూనాలు సేకరించి పరీక్షకు పంపారు. (Jaundice Outbreak in School) ఒడిశాలోని ఖుర్దా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గురుజంగ్లోని జవహర్ నవోదయ విద్యాలయం రెసిడెన్షియల్ స్కూల్లో కామెర్లు వ్యాపించాయి. క్రిస్మస్ సెలవులకు ఇంటికి వెళ్లి తిరిగి వచ్చిన ఒక విద్యార్థికి కామెర్లు ఉన్నట్లు గుర్తించారు. మిగతా విద్యార్థులను పరీక్షించగా 40 మందికిపైగా కామెర్లు సోకినట్లు నిర్ధారణ అయ్యింది.
కాగా, ఈ సమాచారం తెలిసిన వెంటనే జిల్లా ఆరోగ్య అధికారులు అప్రమత్తమయ్యారు. ఆదివారం ఆ రెసిడెన్షియల్ స్కూల్‌ను సందర్శించారు. రాష్ట్ర వైద్య బృందం కూడా సోమవారం వచ్చింది. మరింత మంది విద్యార్థులకు కామెర్లు వ్యాపించకుండా నివారణ చర్యలు చేపట్టారు.
మరోవైపు తాగు నీటి సరఫరా సంస్థ అధికారులు ఆ స్కూల్ నుంచి నీటి నమూనాలు సేకరించి పరీక్షకు పంపారు. అయితే తాగు నీరు కలుషితం కాలేదని అధికారి తెలిపారు. బయట ఆహారం వల్ల స్కూల్ క్యాంపస్‌లో కామెర్లు వ్యాపించినట్లు అనుమానం వ్యక్తం చేశారు.
Also Read:
IAS officer’s rented house | ఇంటిని అద్దెకు ఇచ్చిన ఐఏఎస్ అధికారిణి.. గుట్టుగా వ్యభిచారం
Watch: రెండో భార్య కావాలంటూ.. వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి వ్యక్తి నిరసన, తర్వాత ఏం జరిగిందంటే?