హనుమకొండ చౌరస్తా, జనవరి 5: నిరుద్యోగ యువత కోసం ఈనెల 7వ తేదీన వరంగల్ ప్రభుత్వ ఐటీఐ(ITI) ప్రాంగణంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు వరంగల్ ఐటీఐ ప్రిన్సిపాల్ ఎం.చందర్(MChander) తెలిపారు. ఈ జాబ్ మేళాలో ప్రముఖ కంపెనీ స్టార్డర్డ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కాజీపల్లి, హైదరాబాద్, పిట్టర్, వెల్డర్ హాజరవుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎంపికైనవాళ్లకు పర్మినెంట్ పద్దతిలో ఉద్యోగంలోకి తీసుకుంటారని ప్రిన్సిపల్ వెల్లడించారు.
జాబ్ మేళాలో పాల్గొనేందుకు ఐటీఐలో ఉత్తీర్ణత పొంది, 18 సంవత్సరాల వయస్సు పైబడి ఉండాలని ప్రిన్సిప్ల చందర్ చెప్పారు. ఎంపికైనవాళ్లకు ఏడాదికి రూ.1.9 లక్షల వేతనం, వసతి, భోజన సదుపాయం సబ్సిడీపై కల్పిస్తారని ఆయన తెలిపారు. అర్హత ఉండి, ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత జనవరి 7వ తేదీన ఉదయం 10:30 గంటలకు ములుగు రోడ్‌లోని వరంగల్ ప్రభుత్వ ఐటీఐలో ఒరిజినల్ సర్టిఫికేట్స్‌తో హాజరు కావాలని కోరారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ చందర్ సూచించారు.