Raksha Bandhan : రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా రాఖీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా పలువురు మహిళలు తమ సోదరులకు రాఖీలు కట్టి స్వీట్లు తినిపించారు. పలువురు సీనీ, రాజకీయ ప్రముఖులు కూడా కుటుంబాలతో కలిసి ఈ వేడుకలను జరుపుకుంటున్నారు. కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ముఖ్య నేతల ఇళ్ల దగ్గర వారికి రాఖీలు కట్టేందుకు మహిళలు పోటీ పడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇంటి వద్దకు కూడా ఆయనకు రాఖీలు కట్టేందుకు పలువురు మహిళలు వచ్చారు. దాంతో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం సందడిసందడిగా మారింది. పలువురు మహిళా నేతలు, బ్రహ్మకుమారీలు ఆయనకు రాఖీలు కట్టారు. చంద్రబాబుకు మహిళలు రాఖీలు కడుతున్న దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు.
#WATCH | Amravati: On the occasion of Raksha Bandhan, women leaders and Brahmakumaris tied rakhi to Andhra Pradesh CM N Chandrababu Naidu at his Undavalli residence
(Source: I & PR) pic.twitter.com/zkRg3A9Lvv
— ANI (@ANI) August 19, 2024