MSG | చిరంజీవి ప్రధాన పాత్రలో విక్టరీ వెంకటేష్ గెస్ట్ రోల్‌గా రూపొందిన చిత్రం మన శంకర వరప్రసాద్ గారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. మూవీ ప్రమోషన్లో భాగంగా గత రాత్రి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా, ఈ ఈవెంట్లో వెంకటేష్ మరోసారి తన ఎనర్జీ, గ్రేస్‌తో అభిమానులను ఉర్రూతలూగించారు. అనీల్ రావిపూడి, వెంకటేష్ సరదాగా చేసిన డ్యాన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వెంకీ డ్యాన్స్ చూసి చిరంజీవి కూడా చాలా ఉత్సాహంగా హుక్ స్టెప్ వేయడం అందరిని ఆకట్టుకుంది.
ఇక కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే కథాంశంతో దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో నిర్వహించిన ఈవెంట్ నిజంగానే అభిమానులకు ఓ పండగలా మారింది. ఈ కార్యక్రమానికి వెంకటేష్‌తో పాటు చిత్రబృందం మొత్తం హాజరయ్యింది. ఈవెంట్ మధ్యలో అనిల్ రావిపూడి సరదాగా డ్యాన్స్ చేస్తుండగా, వెంకటేష్ కూడా ఏమాత్రం వెనుకాడకుండా స్టెప్పులు వేశారు. తనదైన స్టైల్, హావభావాలతో చేసిన డ్యాన్స్ ప్రేక్షకులను, అభిమానులను ఉత్సాహంలో ముంచెత్తింది. ముఖ్యంగా ఫ్యామిలీ హీరోగా పేరొందిన వెంకటేష్ నుంచి ఇలాంటి ఎనర్జిటిక్ డ్యాన్స్ చూడటం అభిమానులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
డ్యాన్స్ అనంతరం వెంకటేష్ మాట్లాడుతూ, “అనిల్ రావిపూడితో పని చేయడం చాలా ఆనందంగా ఉంది. ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా ప్రతి ఇంట్లోని ప్రేక్షకుడికి కనెక్ట్ అవుతుంది. చాలా రోజుల తర్వాత పూర్తి స్థాయి కుటుంబ వినోదంతో మీ ముందుకు వస్తున్నాం” అని చెప్పారు. అలాగే ఈ సినిమాలో తన పాత్ర తనకు ఎంతో ప్రత్యేకమని, ప్రేక్షకులు తప్పకుండా ఎంజాయ్ చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ‘మన శంకర వర ప్రసాద్ గారు’ ఇప్పటికే పాటలు, టీజర్‌తో మంచి స్పందన తెచ్చుకుంది. తాజాగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో వెంకటేష్ డ్యాన్స్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. మొత్తానికి ఈ ఈవెంట్ అభిమానులకు గుర్తుండిపోయే అనుభూతిని అందించిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
Cutest video today@VenkyMama sirr and @KChiruTweets sir ❤️❤️❤️@AnilRavipudi 🤗 pic.twitter.com/BVinjlHu3R
— Vijay Deverakonda (@TheDeverakonda) January 7, 2026