Ustaad Bhagat Singh | హరీష్ శంకర్ (Harish shankar) డైరెక్షన్లో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) టైటిల్ రోల్ పోషిస్తోన్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ (UstaadBhagatSingh). శ్రీలీల ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా… రాశీఖన్నా కీలక పాత్ర పోషిస్తోంది.
టాలీవుడ్ టాప్ లీడింగ్ ప్రొడక్షన్ హౌజ్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ నుంచి Aura Of Ustaad సాంగ్ ప్రోమో విడుదల చేయగా నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. తాజాగా మేకర్స్ ఫుల్ లిరికల్ వీడియో సాంగ్‌ను లాంచ్ చేశారు. Aura Of Ustaad సాంగ్ నేను మెడ ముట్టుకుంటే తొడగొట్టినట్టే.. జుట్టు ఎగురుతుంటే ఇక ధడ ధడ పిడుగులు పడినట్టేనంటూ పవన్ కల్యాణ్ స్టైల్ ఆఫ్ మ్యానరిజంతో సాగుతూ అభిమానులు ఆశించే ఎలిమెంట్స్‌తో ఉండబోతుందని విజువల్స్ చెబుతున్నాయి.
ప్రముఖ లిరిసిస్ట్ చంద్రబోస్ రాసిన ఈ పాటను డీఎస్పీ కంపోజిషన్‌లో పీ అభిషేక్ అండ్ డీఎస్పీ టీం పాడింది. ఈ మూవీ నుంచి ఇప్పటికే లాంచ్ చేసిన ఫస్ట్ సింగిల్ దేఖ్ లేంగే సాలా నెట్టింటిని షేక్ చేస్తోంది. తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి
ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్‌లో భగత్.. భగత్ సింగ్ మహంకాళి పోలీస్‌స్టేషన్, పత్తర్ గంజ్, ఓల్డ్ సిటీ. ఈ సారి పర్ ఫార్మన్స్ బద్దలైపోద్ది.. అంటూ పవన్ కల్యాణ్ చెబుతున్న డైలాగ్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాడు పవన్ కల్యాణ్. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రాన్ని మార్చి 26న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
Aura Of Ustaad సాంగ్..
Pawan Kalyan | పవన్ కళ్యాణ్ అభిమానులకి బ్యాడ్ న్యూస్.. ఇక ఆ సినిమా ఇప్పట్లో లేనట్టేనట..!
Jai Hanuman | హనుమంతుడి జన్మస్థలంలో గ్రాండ్‌గా మొదలైన ‘జై హనుమాన్’ – రిషబ్ శెట్టితో భారీ సీక్వెల్!
Farmer Registry | ప్రతీ రైతు ఫార్మర్ రిజిస్ట్రీలో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి..