BRICS 2026 : స్వదేశంలో జరుగుతున్న బ్రిక్స్ సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) కొత్త పంథా అనుసరించారు. ఈ సదస్సుకు విచ్చేసిన దేశాధినేతలు, ప్రతినిధులకు భారత దేశంలోని ప్రాంతీయ వైవిధ్యాన్ని, విశిష్టతను చాటడంలో భాగంగా మోడీ తమిళ సంస్కృతి (Tamil Culture), వైభవానికి పట్టం కట్టారు. 11 దేశాల ప్రతినిధులు హాజరైన ఈ సమావేశంలో ఏరికోరి తమిళ వైభవాన్ని ఆవిష్కరించారు ప్రధాని. ద్వైపాక్షిక బంధాలతో పాటు ప్రజల మధ్య వారథిగా ‘తిరుక్కురల్’ పుస్తకం తోడ్పడుతుందని ఆకాంక్షించిన ఆయన.. లీడర్స్‌ను సదస్సుకు ఆహ్వానించాక తమ వెనకాల డిజిటల్ స్క్రీన్‌లో ఉన్న పురాతన రామనాథ స్వామి ఆలయం విశిష్టతను వారికి వివరించారు.
న్యూ ఢిల్లీలోని భరత మండపం వేదికగా భారత ప్రధాని నరేంద్ర మోడీ తమిళనాడు సంస్కృతికి, ఆ రాష్ట్ర ప్రాచీన వారసత్వానికి పెద్దపీట వేశారు. బ్రిక్స్ 2026 సదస్సుకు విచ్చేసిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు తమిళ ప్రాచీన గ్రంథం ‘తిరుక్కురల్’ను మోడీ బహూకరించారు. ఇరుదేశాల అనుబంధం బలోపేతానికి, రెండు దేశాల ప్రజల మధ్య వారథిగానూ ఈ పుస్తకం ఉపయోగపడుతుందని ప్రధాని తెలిపారు. సదస్సుకు వచ్చిన వారిలో పుతిన్‌కు మాత్రమే మోడీ తిరుక్కురల్‌ను కానుకగా ఇవ్వడం వెనక కారణముంది.
Presented President Putin with a Russian translation of the #Thirukkural, which carries the eternal wisdom of the great #Thiruvalluvar across languages and borders.
-Prime Minister Modi pic.twitter.com/leKx38A8iE
— We Dravidians (@WeDravidians) September 11, 2026
భారతీయ సిద్ధాంతం, సాహిత్యంపై ఆసక్తి కనబరిచిన రష్యన్లు కొందరు 17వ శతాబ్దంలోనే ఈ గ్రంథంను చదివారు. అనంతంరం దీన్ని తమ భాషల్లోకి అనువదించారు. ఆ దేశ రచయిత లియో టాల్‌స్టాయ్ తిరుక్కురుల్ను 19వ శతాబ్దంలో చదివాడట.ఇందులోని విషయసారం ప్రభావం తన రచనలపై ఉందని టాల్‌స్టాయి చెప్పాడని అంటారు. అందుకే.. రష్యన్ కాపీని పుతిన్‌కు మోడీ అందించారు. తమిళ సాహిత్యంలో క్లాసిక్‌గా పేరొందిన తిరుక్కురల్‌ను తిరువళ్లూర్ అనే కవి, సిద్ధాంతకర్త రచించారు. అరమ్(ధర్మ), పొరుల్(అర్థ), ఇన్బమ్(కామ).. ఈ మూడు ప్రధాన అంశాలతో కూడిన ఇందులో 133 చాప్టర్లు ఉన్నాయి.
బ్రిక్స్ సదస్సులో భారతీయ పురాతన ఆలయాల విశిష్టను చాటాలనుకున్న ప్రధాని మోడీ రామనాథస్వామి ఆలయాన్ని ఎంచుకున్నారు. పురాణ, ఇతిహాసాల్లోనూ పేర్కొన్న ఈ గుడిని 2024లో దర్శించుకున్న మోడీ.. ఆ తర్వాత అయోధ్యలో నూతనంగా నిర్మించిన ఆలయంలో బాలరాముడి ప్రాణప్రతిష్టలో పాల్గొన్నారు. శిల్పకళా సంపద పరంగా, ఆధ్యాత్మికంగానూ ప్రాచుర్యం కలిగిన ఈ మందిరాన్ని బ్రిక్స్ వేదికగా ప్రపంచానికి చూపించారు మోడీ.
From seeking the blessings of Lord Ramanathaswamy in Rameswaram ahead of the Ram Mandir Pran Pratishtha in 2024, to proudly placing this magnificent temple as the backdrop at BRICS 2026. @narendramodi Ji has a special love for Tamil Nadu and honestly, it’s so heartwarming to… pic.twitter.com/urjhgi2bjx
— Jhiya Saahithyan (@jhiyabjp) September 12, 2026
రామనాథస్వామి ఆలయం అతి పురాతనమైనది. రామేశ్వరంలోని పంబన్ ద్వీపంలో ఉన్న ఈ దేవాలయం శివుడికి అంకితం చేసిన 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. అతివిశాలమైన హాలు, వైవిధ్యమైన శిల్పకళా నైపుణ్యంతో ఆకట్టుకునే 12,000 గ్రానైట్ పిల్లర్లతో అడుగడుగునా ద్రవిడ సంస్కృతిని ప్రతిబింబింస్తుందీ గుడి. రావణుడి సంహారం అనంతరం రాముడు ఇక్కడి లింగాన్ని పూజించాడని వాల్మీకీ రామాయణం చెబుతోంది. దాంతో, ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందుతున్న ఈ ఆలయాన్ని ఛార్‌ధామ్ యాత్రలో భాగంగా హిందువులు భారీగా దర్శించుకుంటారు.
Prime Minister Narendra Modi ji welcoming Chinese President Xi Jinping, with the majestic Third Prakara of the iconic Ramanathaswamy Temple at Rameswaram forming the backdrop.
The magnificent corridors of Rameswaram, among the great architectural achievements associated with the… pic.twitter.com/S3a7RJFAVK
— 𑀓𑀺𑀭𑀼𑀱𑁆𑀡𑀷𑁆 🇮🇳 (@tskrishnan) September 12, 2026
ఈ ఆలయంలోని గర్భగుడిలో రెండు లింగాలు ఉంటాయి. ఒకటి.. రామలింగం. దీన్ని సీతా దేవి ఇసుకతో చేశారని చెబుతారు. రెండోది.. విశ్వలింగం. దీన్ని కైలాస శిఖరం నుంచి హనుమంతుడు తీసుకొచ్చారని ప్రతీతి. అంతేకాదు ఇక్కడ 22 పవిత్ర గుండాలు(తీర్థాలు) ఉన్నాయి. సముద్ర తీరంలో మునిగిన తర్వాత భక్తులు ఆలయంలోపల ఉన్న ఈ 22 తీర్థాల్లో స్నానమాచరిస్తారు. ఆపై దైవ దర్శనం కోసం గర్భగుడిలోకి వెళ్తారు. రామనాథస్వామిని దర్శించుకునేందుకు అక్టోబర్ నుంచి మార్చి మధ్య అనువైన వాతావరణం ఉంటుంది.