Sunder Pichai : పొట్టి ప్రపంచకప్ ఫీవర్ ప్రపంచమంతా పట్టుకుంది. నాకౌట్ మ్యాచ్‌ల వేళ.. అభిమానులే కాదు పలురంగాల దిగ్గజాలు సైతం క్రికెట్‌కు సలామ్ అంటున్నారు. ఈ జాబితాలో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ (Sunder Pichai) సైతం చేరిపోయారు. అహ్మదాబాద్‌లో భారత్, దక్షిణాఫ్రికా సూపర్ 8 మ్యాచ్ సందర్భంగా ఆయన ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar)తో కలిసి ప్రపంచకప్‌ను మైదానంలోని తీసుకువచ్చారు.
పదో సీజన్ టీ20 ప్రపంచకప్ టోర్నీకి మాజీ ఆటగాళ్లు.. సాంకేతిక నిపుణులు కొత్త కళ తీసుకొస్తున్నారు. భారత పర్యటనలో ఉన్న గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తనకు ఆటపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుందర్‌కు భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) క్రికెట్ పాఠాలు నేర్పారు.
🚨Shubman Gill Teaches Sundar Pichai the Pull Shot🚨
Team India captain Shubman Gill was seen giving him a professional lesson on playing the pull shot to Sunder Pichai, a known cricket enthusiast,pic.twitter.com/ek9NTXlSDR
— Akash (@klrvikash) February 21, 2026
‘ఫుల్ షాట్’ ఎలా ఆడాలో గిల్ చూపించాడు. ఓ ఇలానా? అని గూగుల్ బాస్ ఆసక్తిగా గమనించారు. అనంతరం బ్యాట్ అందుకున్న సుందర్ ఫుల్ షాట్ ఆడి సంబురపడ్డారు. అహ్మదాబాద్ స్టేడియం చేరుకున్న సుందర్ టాస్ అనంతరం.. వరల్డ్‌కప్ ట్రోఫీతో తళుక్కుమన్నారు. భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్‌తో కలిసి ట్రోఫీని మైదానంలోకి తీసుకొచ్చారాయన.
All eyes are on shubman Gill.🚨
– T20 Worldcup is going on but no one is interested because non- performer player Sanju and Tilak are playing.
– Sunder Pichai invited Prince for the launch of phone 10a because he’s fan of Shubman Gill. pic.twitter.com/m3GTqKOtFl— Prince (@JjhaPrince) February 21, 2026