హైదరాబాద్ : బీఆర్ఎస్లోకి(BRS) వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. రెండ్లేడ్ల కాంగ్రెస్(Congress )పాలనతో విసుగు చెందిన వివిధ పార్టీల నేతలు స్వచ్ఛందంగా బీఆర్ఎస్లో చేరుతున్నారు. కాంగ్రెస్ను నమ్ముకుంటే రాజకీయ భవిత్యం ఆగమేనని గుర్తించిన నేతలు ఆ పార్టీకి చెయ్యిస్తున్నారు. ఈ క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ బీఆర్ఎస్లో చేరికల జోరు ఊపందుకున్నది. అధికార పార్టీ కాంగ్రెస్తో పాటు బీజేపీ నుంచి కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో గులాబీ గూటికీ చేరుతుండగా, ఆ పార్టీల ఉనికి లేకుండా పోతున్నది. తాజాగా నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్(kollapur) నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. హైదరాబాద్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) సమక్షంలో నేడు బీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధమయ్యారు. వారికి కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు.
కాగా, జాతీయ పార్టీల్లో కీలకంగా వ్యవహరించిన నేతలు కూడా కారెక్కుతున్నారు. సాధారణంగా అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీలోకి వలసలు చాలా అరుదు. కానీ, రెండేండ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజావ్యతిరేక కార్యక్రమాలు, చర్యలను జీర్ణించుకోలేని చాలామంది హస్తం నేతలు బీఆర్ఎస్లోకి వస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ వైఫల్యాలను బీఆర్ఎస్ నేతలు క్షేత్రస్థాయిలోకి తీసుకెల్లి ప్రజల పక్షాన పోరాడుతుండటంతో పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయి. మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అసాధ్యమని తేలిపోతుండటంతో బీఆర్ఎస్లోకి చేరికలు ఊపందుకున్నాయి.