కారేపల్లి, జనవరి 5: అనారోగ్యంతో మృతి చెందిన నునావత్ రంగమ్మ కుటుంబానికి గంగారం తండా సర్పంచ్ నునావత్ కిరణ్ నాయక్ (Nunavath Kiran Naik), పిఆర్ ఏఈ అశోక్ (Ashok) అండగా నిలిచారు. బాధిత కుటుంబ అవసరాల కోసం రూ.5 వేల రూపాయల ఆర్ధిక సాయం అందజేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ కిరణ్ నాయక్ మాట్లాడుతూ.. నునావత్ మోతిలాల్ జ్ఞాపకార్థం సేవా కార్యక్రమాలు చేపడుతున్న తన కుమారుడు పంచాయతీరాజ్ ఏఈ అశోక్ కుమార్ను అభినందించారు. అదేవిధంగా కష్టాల్లో ఉండే కుటుంబాలకు అండగా నిలవాలని సర్పంచ్ కోరారు. ఈ కార్యక్రమంలో హరిలాల్, మంగ, శ్రీను, మంగీలాల్, దేశి లాల్, తదితరులు పాల్గొన్నారు.