నేను ఉగాదిని
నేను ఉగాదిని కోటి చిరునవ్వుల కాంతితో జీవం నింపడానికి ప్రకృతి గర్భంలో మొలిచిన కొత్త చిగురులా నన్ను నేను సానపరుచుకొని మీలో ఒకదానినై ఉదయించడానికి వస్తున్నాను.
నేను ఉగాదిని
కోటి చిరునవ్వుల కాంతితో
జీవం నింపడానికి
ప్రకృతి గర్భంలో మొలిచిన
కొత్త చిగురులా
నన్ను నేను సానపరుచుకొని
మీలో ఒకదానినై
ఉదయించడానికి వస్తున్నాను.
మీరు వదిలేసిన
మీ గతానికి స్వస్తి చెప్పి
భవిష్యత్తు కోసం ఆరాటపడే
మీ జీవిత వర్ణానికి
పత్రహరితం దిద్దడానికి
భానుడి కిరణాల నుంచి
వస్తున్న మరో కొత్త ఉగాదిని.
రోడ్ల కూడలిలో రాలిపోయిన
పుష్పరెక్కల మధ్య
షడ్రుచుల పరిమళంలా
వెలుగులు వెదజల్లడానికి
రెక్కలు కట్టుకొని వస్తున్న
తెలుగింటి ఆడపడుచుని.
నన్ను నన్నుగా చూసి
నీవు ఎంతవరకు
నిన్ను నిన్నుగా
శిల్పంలా చెక్కుకున్నావో చూడాలని
నీ కన్నీటి రాగాలను లాలించి
నిన్ను నా ఒడిలో
నిద్రపుచ్చడానికి వస్తున్నాను.
ఇప్పటికైనా గుర్తుపట్టావా..
నేను ఎవరో కాదు
మీ తెలుగింటి ఉగాదిని..
– ఇంద్రావత్ రాహుల్ నాయక్ ఉస్మానియా విశ్వవిద్యాలయం, 9848054079
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

