ఆరు రుచుల ఆరోగ్యం!
జీవితం షడ్రుచుల సమ్మేళనం అని చెప్పేదే.. ఉగాది పచ్చడి. అయితే, దీనివెనక అనేక ఆరోగ్య ప్రయోజనాలూ ఉన్నాయి. ఉగాది పచ్చడిలో వాడే ఆరు పదార్థాలు.. పలు అనారోగ్యాలను దూరం చేస్తాయి.
జీవితం షడ్రుచుల సమ్మేళనం అని చెప్పేదే.. ఉగాది పచ్చడి. అయితే, దీనివెనక అనేక ఆరోగ్య ప్రయోజనాలూ ఉన్నాయి. ఉగాది పచ్చడిలో వాడే ఆరు పదార్థాలు.. పలు అనారోగ్యాలను దూరం చేస్తాయి. ముఖ్యంగా, వసంతకాలం తర్వాత వాతావరణంలో మార్పుల వల్ల కలిగే సమస్యల నుంచి మనల్ని కాపాడుతాయి. ఎండాకాలాన్ని తట్టుకునే శక్తిని ఇస్తాయి.
బెల్లం: ఉగాది పచ్చడిలో తీపి కోసం వేసే బెల్లంలో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. ఇది రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి, రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది. మహిళలు, గర్భిణులకు ఎంతో మేలు చేస్తుంది. జీర్ణ ఎంజైమ్స్‌ను ఉత్తేజపరిచి.. మలబద్ధకాన్ని నివారిస్తుంది. బెల్లంలోని జింక్, సెలీనియం లాంటి మినరల్స్, యాంటి ఆక్సిడెంట్లు.. రోగనిరోధకశక్తిని పెంచుతాయి. ఇక ఊపిరితిత్తులను శుభ్రపర్చడంలోనూ బెల్లం ముందుంటుంది. కాలేయంలోని విష పదార్థాలను బయటికి పంపేస్తుంది.
వేప పువ్వు: చేదుగా ఉండే వేప పువ్వు.. అద్భుతమైన ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. సుమారు 35 రకాల వ్యాధులకు వేపను ఔషధంగా వాడుతారని ఆయుర్వేదం చెబుతున్నది. రక్తాన్ని శుద్ధి చేయడంలో వేప పువ్వులు ముందుంటాయి. ఇందులోని యాంటి బ్యాక్టీరియల్ గుణాలు.. చర్మ సంబంధ సమస్యలను నివారిస్తాయి. పొట్టలోని హానికరమైన నులిపురుగులను నివారించడంలో వేప పువ్వులు సమర్థంగా పనిచేస్తాయి. ఉగాది సమయంలో వీటిని తీసుకోవడం ద్వారా.. ఏడాది పొడవునా జీర్ణకోశ సమస్యలు రాకుండా ఉంటాయి. వేప పువ్వులు శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్‌ను తొలగిస్తాయి. అధిక వేడిని తగ్గించి, పిత్త దోషాన్ని సమతుల్యం చేస్తాయి.
చింతపండు: పులుపు కోసం కలిపే చింతపండులో పాలిఫెనాల్స్, ఫ్లేవనాయిడ్లు అధికంగా లభిస్తాయి. ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో సాయపడతాయి. ఫలితంగా, రక్తపోటు నియంత్రణలో ఉండి, గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది. చింతపండులోని టార్టారిక్ యాసిడ్, ఫైబర్.. సహజ విరేచనకారిగా పనిచేస్తాయి. మలబద్ధకం సమస్యను నివారిస్తాయి. ఇందులోని విటమిన్ సి.. శరీరానికి రోగనిరోధక శక్తిని అందిస్తుంది. కాలేయం చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించడంలోనూ చింతపండు
సహాయపడుతుంది.
మామిడి పిందెలు: వగరు రుచి రావడానికి మామిడి కాయ ముక్కల్ని వేస్తాం. వేసవిలో వచ్చే వడదెబ్బను నివారించడంలో మామిడికాయ అద్భుతంగా పనిచేస్తుంది. పచ్చి మామిడిలోని ఫైబర్.. జీర్ణ రసాల ఉత్పత్తిని పెంచుతుంది. అజీర్తి, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది. పేగుల ఆరోగ్యాన్నీ మెరుగుపరుస్తుంది. మామిడి పిందెల్లో విటమిన్-సి పుష్కలంగా లభిస్తుంది. శరీరంలో రోగనిరోధకశక్తిని పెంచి, ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. కాలేయాన్ని కాపాడటంలోనూ, కొత్త రక్త కణాల ఉత్పత్తితోపాటు రక్తాన్ని శుద్ధి చేయడంలోనూ మామిడి ముందుంటుంది.
కారం: ఉగాది పచ్చడిలో కారం కోసం కలిపే కారప్పొడి.. మన శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యంగా ఇందులోని క్యాప్సైసిన్ అనే సమ్మేళనం.. అద్భుతమైన ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. కారం తిన్నప్పుడు నోటిలో లాలాజలం, కడుపులో జీర్ణ రసాల ఉత్పత్తి పెరుగుతుంది. తిన్న ఆహారం త్వరగా అరగడానికి, గ్యాస్, అజీర్తి సమస్యల్ని తగ్గించడానికి సహాయపడుతుంది. కారంలోని క్యాప్సైసిన్.. శరీరంలోని మెటబాలిజం రేటును పెంచుతుంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికీ, రక్త నాళాల్లో రక్తం గడ్డకట్టకుండా ఉండటానికీ కారం తోడ్పడుతుంది.
ఉప్పు: ఏ ఆహారానికైనా రుచినిచ్చే ప్రధాన వస్తువు ఉప్పు. శరీరానికి అవసరమైన ఒక ముఖ్యమైన ఖనిజం కూడా. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో ఉప్పుది కీలక పాత్ర. వేసవిలో వేధించే డీహైడ్రేషన్ బారినుంచి కాపాడుతుంది. నరాల వ్యవస్థ చురుగ్గా పనిచేయడానికి, ఆలోచనా శక్తి మెరుగుపడటానికి తోడ్పడుతుంది. శరీరంలోని ఎలక్ట్రోలైట్ స్థాయులను క్రమబద్ధీకరించి.. కండరాలు పట్టేయకుండా ఉప్పు నిరోధిస్తుంది. సరైన మోతాదులో ఉప్పు తీసుకోవడం వల్ల రక్తపోటు స్థిరంగా ఉంటుంది.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
IndiGo Flight | ప్రయాణికుడి పవర్ బ్యాంకువల్ల ఇండిగో ఫ్లైట్‌లో మంటలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Voters Turn Donors In Meghalaya | దాతలుగా మారిన ఓటర్లు.. ప్రాంతీయ పార్టీకి ఉదారంగా విరాళాలు
Madaram dispensary | మాదారం డిస్పెన్సరీ తరలింపు కుట్రను అడ్డుకుంటాం : మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

