Pushpa 2 – Chaava | బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ అల్లు అర్జున్‌కు పోటిగా వస్తున్నాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం పుష్ప 2. బ్లాక్ బస్టర్ మూవీ పుష్పకు సీక్వెల్‌గా రాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 06న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇదే రోజున బాలీవుడ్ నుంచి మరో ప్రెస్టీజియస్ మూవీ రాబోతుంది.
బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ఛావా(Chhaava). ఈ సినిమాను కూడా డిసెంబర్ 06న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. దీంతో ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద తలపడబోతున్నట్లు తెలుస్తుంది.
అల్లు అర్జున్‌కు పుష్ప సినిమాతో బాలీవుడ్లో చాలా పాపులారిటీ వచ్చింది. ముఖ్యంగా తెలుగులో కంటే పుష్ప చిత్రం బాలీవుడ్లోనే ఎక్కువ వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమాకు ఇప్పుడు ఛావా(Chhaava) గట్టి పోటి ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే చావా చిత్రం మహారాష్ట్ర చక్రవర్తి ఛత్రపతి శివాజీ మహారాజ్ బయోపిక్‌గా రాబోతుంది. ఈ సినిమాలో శివాజీగా విక్కీ నటిస్తున్నాడు. దీంతో ఈ రెండు సినిమాలపై భారీ అంచనాలు ఉండబోతున్నాయి. మరోవైపు ఈ రెండు సినిమాలలో కథానాయికగా రష్మిక మందన్న నటిస్తుంది.
Also Read..