Chhaava Teaser – Vicky Kaushal | తనకంటూ డిఫరెంట్ జానర్లను ఎంచుకుంటూ కెరీర్ బిగెనింగ్ నుంచి కొత్త కథలతో అలరిస్తున్నాడు బాలీవుడు నటుడు విక్కీ కౌశల్. సినిమాల రిజల్ట్ సంగతి ఎలా ఉన్నా.. థియేటర్లకు వెళ్లే ప్రేక్షకులకు కొత్త ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వాలని ఎప్పుడూ తాపత్రయపడుతుంటాడు. ఈ మధ్యనే సామ్ బహదూర్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు. అయితే విక్కీ మరో బయోపిక్ సినిమాతో ముందుకువస్తున్నాడు. విక్కీ కౌశల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ఛావా (Chhaava). ఈ సినిమాకు డియర్ జిందగీ, ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రాల ఫేం లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహిస్తుండగా.. మొగల్ చక్రవర్తులను గడగడలాడించిన మహారాష్ట్ర రాజు ఛత్రపతి శివాజీ పాత్రలో విక్కీ నటించబోతున్నాడు.
ఈ సినిమాలో కథానాయికగా రష్మిక మందాన్న నటిస్తుండగా.. ఈ మూవీని డిసెంబర్ 06న విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం తాజాగా ప్రకటించింది. ఈ సందర్భంగా టీజర్న్ విడుదల చేసింది. ఛత్రపతి శివాజీ మహారాజ్‌ను సింహం అని పిలుస్తారు అంటూ మొదలైన ఈ టీజర్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. మరోవైపు ఈ సినిమాతో పాటు డిసెంబర్ 06 న అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 చిత్రం కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ రెండు సినిమాలలో రష్మిక మందాన్న కథానాయికగా నటిస్తుండటం విశేషం.
Also Read..