Pune | మహారాష్ట్ర పూణె (Pune) నగరాన్ని మరోసారి భారీ వర్షం (Heavy Rain) ముంచెత్తింది. ఆదివారం కురిసిన కుండపోత వర్షానికి నగరం మొత్తం స్తంభించిపోయింది. ప్రధాన రహదారులు, వీధులు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరింది. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
ఆదివారం పూణె దాని పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. సబ్‌వేలు, అండర్‌పాస్‌లు, రోడ్లు, వీధులు పూర్తిగా నీట మునిగాయి. ప్రధాన రహదారులు నదులను తలపిస్తున్నాయి. రోడ్లపై మోకాళ్లలోతు నీరు చేరడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చాలా ప్రాంతాల్లో వాహనాలు సైతం నీట మునిగాయి. ఈ వర్షానికి పూణెలోని రైల్వే స్టేషన్ సైతం నీట మునిగింది (train station flooded). స్టేషన్ ప్రాంగణంలో మోకాళ్ల లోతు నీరు చేరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పూణెలోని వాడ్గావ్ షెరీ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం 101.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
#Pune #PuneRain#PuneStation
🌧️🌩️☔ pic.twitter.com/dMCzCWRfJd— Chaitanya Kolekar (@Chetan7_kolekar) August 18, 2024
#WATCH | Pune, Maharashtra: Severe waterlogging witnessed in parts of Pune after incessant rainfall.
(Visuals from Lullanagar area) pic.twitter.com/HThwMoyGND
— ANI (@ANI) August 18, 2024
Pune: Heavy rain in Pune across all areas. Knee deep Water logging Opposite Jaisinghrao Sasane Garden Pune Corporation Garden, BT Kawade Rd, Pune @PMCPune pic.twitter.com/Tptlz3eUmH
— Pune Pulse (@pulse_pune) August 18, 2024
पुण्यातील टिंबर मार्केट परिसरात पावसामुळे झालेली परिस्थिती#pune #PuneRain #punerains #TimberMarket pic.twitter.com/TVxbmfQzUG
— Checkmate Times (@checkmate_times) August 18, 2024
Also Read..
Sand Art | రాఖీ పౌర్ణమి.. పూరీ తీరంలో ఆకట్టుకుంటున్న సైకత శిల్పం
Raksha Bandhan | రాఖీ పండగ స్పెషల్.. సిస్టర్ సెంటిమెంట్‌తో వచ్చిన తెలుగు సినిమాలు ఇవే.!
Aamir Khan | క్రేజీ కాంబినేషన్.. బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్తో లోకేష్ కనగరాజ్మూవీ