Aamir Khan – Lokesh Kanagaraj | బాలీవుడ్ ఖాన్లంతా ఇప్పుడు సౌత్ బాటా పడుతున్నారు. ఇప్పటికే కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ అట్లీతో కలిసి జవాన్‌తో బ్లాక్ బస్టర్ అందుకోగా.. కండలవీరుడు సల్మాన్ ఖాన్ మురుగుదాస్‌తో కలిసి సికిందర్ అనే మూవీ చేస్తున్నాడు. అయితే ఈ లీస్ట్‌లోకి మరో ఖాన్ వచ్చి చేరాడు. బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ ఆమీర్ ఖాన్ మళ్లీ సౌత్ దర్శకుడితో చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికే ఈ స్టార్ హీరో సౌత్ దర్శకులతో చేసి బ్లాక్ బస్టర్లు అందుకున్న విషయం తెలిసిందే. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన రంగీలా చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఆమీర్ ఆ తర్వాత దిగ్గజ దర్శకుడు మురుగుదాస్‌తో గజిని సినిమా తీసి సూపర్ హిట్ అందుకున్నాడు. అయితే మరోసారి ఆమీర్ చూపులు సౌత్‌కి చెందిన ఒక స్టార్ దర్శకుడిపై పడినట్లు తెలుస్తుంది. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరో కాదు. ఖైదీ, విక్రమ్, మాస్టర్, లియో లాంటి బ్లాక్ బస్టర్లు అందుకున్న లోకేష్ కనగరాజ్.
అవును.. ఆమీర్ ఖాన్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ లోకేష్ కనగరాజ్‌తో చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా రాబోతున్న ఈ సినిమాను టాలీవుడ్ టాప్ ప్రోడక్షన్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇక ఆమీర్ ఖాన్ ప్రస్తుతం తారే జమీన్ పర్ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్నా సితారే జమీన్ పర్ అనే సినిమాలో నటిస్తుండగా.. లోకేష్ కనగరాజ్ రజినికాంత్‌తో కలిసి కూలీ అనే సినిమా షూటింగ్లో బిజీ ఉన్నాడు.