Raksha Bandhan | అన్నా చెల్లెలి అనుబంధం.. జన్మజన్మలా సంబంధం.. జాబిలమ్మకిది జన్మదినం.. కోటి తారకల కోలాహలం..’ అంటూ ఎన్నో పాటలు అన్నాచెల్లిలి అనుబంధం గురించి వివరిస్తున్నాయి. అన్నయ్య లేదా తమ్ముడు తనకు ఎలాంటి కష్టం వచ్చినా తోడుగా నిలుస్తాడని చెల్లిలి నమ్మకం. తన అన్నకు ఎలాంటి నష్టం రాకూడదని, సమస్యల చిక్కుముడి నుంచి విడుదల కలగాలని, జీవితాంతం సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ చెల్లెలు రాఖీని కడుతుంది.
అయితే తోబుట్టువుల అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే ఈ రాఖీ పండగ నేడు వచ్చేసింది. ఈరోజు రాఖీ పండగ రావడంతో ఇప్పటికే ఆడబిడ్డలు తమ పుట్టింటికి వెళుతున్నారు. అయితే సిస్టర్ సెంటిమెంట్‌తో తెలుగులో కూడా చాలా మూవీలు వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక రక్షా బంధన్ రోజున అన్నాచెల్లెళ్లు, అక్కా తమ్ముళ్లు కలిసి చూసేందుకు ఓటీటీ తెలుగులో పలు చిత్రాలు అందుబాటులో ఉన్నాయి. ఇక ఆ చిత్రాలు ఏవి అనేవి చూసుకుంటే..
పుట్టింటికి రా చెల్లి– కన్నడ యాక్షన్ కింగ్ అర్జున్ నటించిన చిత్రం పుట్టింటికి రా చెల్లి. సిస్టర్ సెంటిమెంట్‌తో వచ్చిన ఈ సినిమాను చూడడానికి అప్పట్లో మహిళలు ఎండ్లబండ్లలో వెళ్లేవారు. రాఖీ రోజు తప్పక చూడాల్సిన సినిమాల్లో ఇది ఒకటి. ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ వేదిక యూట్యూబ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది.
హిట్లర్ – మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య పాత్రల్లో నటించి హిట్ అందుకున్న చిత్రం హిట్లర్. ఈ సినిమాలో ఐదుగురు చెల్లెళ్ల బాధ్యతలను చూసుకునే అన్నగా చిరు నటించడం హైలైట్‌గా చెప్పుకోవచ్చు. ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ యూట్యూబ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది.
నువ్వొస్తానంటే నేనొద్దంటానా – రియల్ స్టార్ శ్రీహరి, సిద్ధార్థ్, త్రిష ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం నువ్వొస్తానంటే నేనొద్దంటానా. చిన్నప్పుడే అమ్మనాన్నలను కోల్పోయి చెల్లికి అన్ని తానై అండగా ఉంటాడు శ్రీహరి. అయితే తన చెల్లిని ప్రేమిస్తున్నాను అంటూ ఇంటికి వచ్చిన సిద్ధార్థ్‌ను శ్రీహరి ఏం చేశాడు. చివరికి వాళ్లిద్దరి పెళ్లికి ఒప్పుకున్నాడా అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ య్యూటూబ్‌లో ఉంది.
గోరింటాకు – రాజశేఖర్, మీరా జాస్మిన్ అన్నాచెల్లెళ్ల పాత్రల్లో నటించిన సూపర్ హిట్ మూవీ గోరింటాకు. అప్పట్లో ఈ సినిమా చూసి మహిళలు కన్నీళ్లు పెట్టకుండా థియేటర్ నుంచి రాలేదంటే ఈ సినిమా ఎంత ఇంపాక్ట్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. ఈ చిత్రం ప్రముఖ ఓటీటీలు జీ5తో పాటు యూట్యూబ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
అర్జున్ – అప్పటివరకు కమర్శియల్ సినిమాలు చేసిన సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫస్ట్ టైం సిస్టర్ సెంటిమెంట్‌తో ఒక మూవీ చేశాడు. ఆ సినిమానే అర్జున్. ఒక్కడు లాంటి బ్లాక్ బస్టర్‌ను అందించిన గుణశేఖర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. అత్త మామాల నుంచి తన అక్కను కాపాడుకునే తమ్ముడి పాత్రలో మహేశ్ ఇందులో కనిపించాడు. ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది.
అన్నవరం – పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ బాగా ఇష్టపడి రీమేక్ చేసిన సినిమా ఇది. తమిళంలో హిట్ అయిన తిరుప్పాచ్చికి రీమేక్‌గా వచ్చిన ఈ చిత్రం తెలుగులో కూడా మంచి వసూళ్లను సాధించింది. అన్నవరం సినిమాలోని సాంగ్స్ కూడా అప్పట్లో చార్ట్ బస్టర్‌గా నిలిచాయి. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ వేదిక జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది.
రాఖీ – సింహ్రాది లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వరుసగా మూడు ఏళ్లు ఫ్లాప్‌లతో సతమవుతున్నా జూ.ఎన్టీఆర్‌కి రాఖీ రూపంలో హిట్ అందుకున్నాడు. తన చెల్లికి ఎంత చిన్న కష్టం వచ్చిన చూసుకునే అన్నయ్య పాత్రల్లో తారక్ కనిపించడం ఈ మూవీకే హైలైట్‌గా నిలిచింది. కృష్ణవంశీ దర్శకత్వం వచ్చిన ఈ చిత్రం యూట్యూబ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది.
ఇంకా ఇవే కాకుండా.. జగపతిబాబు శివరామరాజు, చెల్లెలి కాపురం, పల్నాటి పౌరుషం, రక్త సంబంధం, బంగారు గాజులు, బ్రదర్ ఆఫ్ బొమ్మాళి, బ్రూస్ లీ, కత్తి, హనుమాన్, వీరసింహారెడ్డి, భోళాశంకర్, బ్రో, పెద్దన్న వంటి సినిమాలు కూడా సిస్టర్ సెంటిమెంట్‌తో వచ్చినవే.