Sand Art | సోదరి సోదరీమణుల పవిత్ర బంధవ్యానికి ప్రతీక రాఖీ పౌర్ణమి వేడుక (Raksha Bandhan). ఎంతో ఆప్యాయంగా తన సోదరుడికి రాఖీ కట్టి, నోరు తీపి చేసి తనకు అన్నీ శుభాలే కలగాలని, వారి బంధం కలకాలం ఇలాగే ఉండాలని ఆకాంక్షిస్తుంది. రక్త సంబంధం ఉన్నా లేకున్నా సోదరి రక్షా బంధనం కట్టి సోదరుడి నుంచి ఆశీస్సులు అందుకుంటుంది. తమ బంధం ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటుంది.
ఇంతటి ప్రతీక గల ఈ రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని సోదర సోదరీమణులకు ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ (Sudarsan Pattnaik) శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఒడిశాలోని పూరీ తీరంలో (Puri beach) ప్రత్యేక సైకత శిల్పాన్ని (Sand Art) రూపొందించారు. ఇది అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది.
#WATCH | Odisha: Renowned sand artist Sudarsan Pattnaik created sand art at Puri beach, on the occasion of Raksha Bandhan. (18.08)
(Source: Sudarsan Pattnaik’s social media) pic.twitter.com/ggfQeMKLwM
— ANI (@ANI) August 19, 2024
Also Read..
Raksha Bandhan | రాఖీ పండగ స్పెషల్.. సిస్టర్ సెంటిమెంట్‌తో వచ్చిన తెలుగు సినిమాలు ఇవే.!
India Day Parade | న్యూయార్క్‌లో ఘనంగా ఇండియా డే పరేడ్.. ఆకట్టుకున్న అయోధ్య రామ మందిరం నమూనా
KTR | కేటీఆర్‌తో శ్రీలంక మంత్రి భేటీ.. హైదరాబాద్‌ను అవకాశాల అక్షయపాత్రగా మార్చారన్న సదాశివన్