Raksha Bandhan : దేశవ్యాప్తంగా రాఖీ వేడుకలు (Rakhi celebrations) ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరులను రక్షణ కల్పించాలని కోరుతూ ఆడపడుచులు రాఖీలు కడుతున్నారు. ఒకరికొకరు మిఠాయిలు తినిపంచుకుని నోరు తీపి చేసుకుంటున్నారు. ఈ క్రమంలో బీహార్ ముఖ్యమంత్రి (Bihar CM) నితీశ్ కుమార్ (Nitish Kumar) కూడా రాఖీ వేడుకల్లో పాల్గొన్నారు.
బీహార్ రాజధాని పట్నాలో ఆయన రాఖీ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పట్నాలో ఓ చెట్టుకు ఆయన రాఖీ కట్టారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, అధికారులు కూడా పాల్గొన్నారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్ చెట్టుకు రాఖీ కట్టిన దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు.
#WATCH | Bihar CM Nitish Kumar celebrates Raksha Bandhan by tying Rakhi around a tree, in Patna. pic.twitter.com/bEMmu0KP63
— ANI (@ANI) August 19, 2024